Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్ - ఢిల్లీలో ట్రాఫిక్ జామ్

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (12:29 IST)
త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో అనేక రాష్ట్రాల్లో ట్రాఫిక్ కష్టాలు ఉత్పన్నమయ్యాయి. ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. 
 
ముఖ్యంగా, ఈ భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే, దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.
 
భారత్‌ బంద్‌ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. దీంతో ఢిల్లీ - గురుగ్రామ్‌, ఢిల్లీ - నోయిడా హైవేలపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. తనిఖీల తర్వాతే వాహనాలను ఢిల్లీ లోపలకు అనుమతిస్తామని పోలీసులు స్పష్టంగా చెప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
హైవేలపై వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు, అగ్నిపథ్‌పై కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని పలు రహదారులను మూసివేశారు. దీంతో నగరంలోనూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.
 
అగ్నిపథ్ ఆందోళనల దృష్ట్యా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బీహార్‌లోని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. ఝార్ఖండ్‌లో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసివేసి సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా స్టేషన్‌ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. నిరసనల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో నడిచే అనేక రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments