Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమాంధ్ర సభ్యులపై సోనియా ఫైర్ :స్తంభించిన ఉభయసభలు

Webdunia
FILE
సమైక్యాంధ్ర నినాదాలు పార్లమెంటులో మార్మోగాయి. విభజనకు ఒడిగట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఆందోళనకు దిగడంతో సోమవారం పార్లమెంటు ఉభయ సభలు స్తంభించాయి.

కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు, తెలుగుదేశానికి చెందిన నలుగురు లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు విభజన అంశాన్ని పెద్దఎత్తున ప్రస్తావిస్తూ తొలిరోజు పార్లమెంట్ సమావేశాలను పూర్తిగా అడ్డుకున్నారు.

ఇంకా నినాదాలతో పోడియం వద్దకు చేరిన కాంగ్రెస్ సభ్యులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని పేరు పెట్టి పిలిచి వెనక్కి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో మాగుంట పక్కనేవున్న కనుమూరి బాపిరాజు సైతం సీట్లలోకి వెళ్లాల్సి వచ్చింది.

సోనియాగాంధీ ఆదేశంతో పోడియం వద్ద ఉన్న మరో నలుగురు సభ్యులు కూడా వెనక్కి వచ్చి నిలబడాల్సి వచ్చింది. సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ కాంగ్రెస్, తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన నినాదాలతో లోక్‌సభ గందరగోళంలో పడింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments