Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ప్రభుత్వం - గుజ్జర్ల మధ్య కుదిరిన ఒప్పందం!

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2010 (11:31 IST)
రాజస్థాన్ ప్రభుత్వం, గుజ్జర్ల సంఘ ప్రతినిధులు ఓ అవగాహనకు వచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో గుజ్జర్లు శాంతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గుజ్జర్ల డిమాండ్ మేరకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

దీనిపై గుజ్జర్ ఆరాక్షన్ సంఘర్ష్ సమితి అధికార ప్రతినిధి రూప్ సింగ్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంలో ఇరు వర్గాలు ఓ అంగీకారానికి వచ్చారని చెప్పారు. ఇరు వర్గాలు మధ్య నెలకొన్న సమస్యల్లో 80 శాతం మేరకు పరిష్కారమయ్యాయని చెప్పారు. మిగిలిన సమస్యల పరిష్కార దిశగా చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.

గుజ్జర్ల ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, 80 వేల ప్రభుత్వ పోస్టుల తక్షణం భర్తీపైనే సందిగ్ధత నెలకొని ఉందని చెప్పారు. దీనిపై గుజ్జర్ల నేత బైంస్లా మాట్లాడుతూ.. ఈ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు రిక్రూట్స్‌ను నిలిపి వేయాలని డమాండ్ చేశారన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments