రాజకీయాలంటేనే రోత పుట్టింది: జస్వంత్

Webdunia
జిన్నాపై వ్యాఖ్యలు చేసి బహిష్కారానికి గురైన భాజపా నేత జస్వంత్ సింగ్ శనివారం హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తనపై భాజపా సస్పెన్షన్ ఎత్తివేసినా తిరిగి ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజికీయాలంటేనే రోత పుట్టిందనీ, విలువలు... మాటకు కట్టుబడి ఉండటంవనేవి చుక్కాని వేసినా కనబడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

అసలు ఇపుడున్న రాజకీయ పార్టీలన్నీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయాయని, కనుక భవిష్యత్తులో ఏ పార్టీలోనూ చేరబోనని తెలిపారు. జిన్నాపై తాను చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి తప్పులేదని సమర్థించుకున్నారు. దేశంలో హిందూ- ముస్లింల మధ్య నెలకొన్న మనస్పర్థలను అణదొక్కేందుకు తాను చేయవలసినదంతా చేస్తానని ఉద్ఘాటించారు.

గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లపై మాట్లాడుతూ... దానికి పూర్తిగా భాజపాదే బాధ్యత అని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చమని అధిష్టానానికి సూచించినా వారు తన మాటను ఖాతరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

Show comments