Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మా గాంధీ: పాట్నాలో 70 అడుగుల ఎత్తుతో కాంస్య విగ్రహం ఆవిష్కరణ!

Webdunia
FILE
ప్రపంచంలోనే పెద్దదైన జాతిపిత మహాత్మాగాందీ విగ్రహాన్ని బీహార్‌లో ఆవిష్కరించారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీష్ కుమార్ జాతిపిత విగ్రహాన్ని ఆవిష్కరించారు. సుమారు 70 అడుగుల ఎత్తున్న జాతిపిత విగ్రహాన్ని పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానంలో నెలకొల్పారు. ఇది కాంస్య విగ్రహం కావడం గమనార్హం.

దీనిని పది కోట్ల రూపాయల వ్యయంతో బీహార్ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఢిల్లీకి చెందిన శిల్పి రామ్‌ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. మహాత్ముడు నిలబడి ఉన్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తమకు ఎంతో గర్వకారణమని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటి వరకు ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్ముడి విగ్రహమే పెద్దదిగా భావిస్తున్నారు. పార్లమెంటులో గాంధీ విగ్రహం ధ్యానముద్రలో ఉంటారు. పాట్నాలో నెలకొల్పిన విగ్రహంలో గాంధీజీ చిరునవ్వుతో కనిపిస్తారు.

పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎత్తు 16 అడుగులు కావడం గమనార్హం. అయితే పాట్నాలోని గాంధీ విగ్రహం ఎత్తు 40 అడుగులు. ఇందుకోసం ఉపయోగించిన పీఠం ఎత్తు ముప్పై అడుగులు. మొత్తం డెబ్బై అడుగుల ఎత్తు విగ్రహం అని బీహార్ ప్రభుత్వం వెల్లడించింది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments