Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి అన్ని వినోదాలూ తెలుసు: "పోర్న్"పై కాంగ్రెస్ సెటైర్లు

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2012 (16:14 IST)
FILE
కర్నాటక అసెంబ్లీలో నీలిచిత్రాల వ్యవహారంలో బీజేపీపై కాంగ్రెస్ దాడిని ముమ్మరం చేసింది. కాషాయ పార్టీకి అన్ని రకాల వినోదాలూ తెలుసని.. తెలియని వినోదమంటూ ఏదీ లేదని కాంగ్రెస్ ప్రతినిధి కపిల్ సిబాల్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఒకవైపు ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలను విసరుతూనే మరోవైపు బీజేపీ తీరును దుయ్యపట్టారు.

ఇతరులకు నీతి సూత్రాలు బోధించే బీజేపీ ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలన్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు అన్ని రకాల వినోదాలను ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తోంది.. ఆ పార్టీ నేతలకు రాజకీయ వినోదం తెలుసు.. "ఆ వినోదాలు" కూడా తెలుసు అన్నారు. ప్రస్తుతం తన ప్రజాప్రతినిధుల తీరును చూస్తున్న ఆ పార్టీకి నోటమాటరావడం లేదన్నారు.

కపిల్‌కు తోడుగా ఇటువైపు అభిషేక్ సింఘ్వీ కూడా మాట కలిపారు. బీజేపీ చెప్పే నీతిసూత్రాలకు, ఆచరణకు అసలు పొంతనే ఉండదన్నారు. అవినీతి నుండి అసెంబ్లీలో నీలిచిత్రాల వీక్షణ వరకు ఆ పార్టీ ప్రస్తానం కొనసాగుతూ వస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్ కూడా జతకలిసింది.

జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దీన్ని 12 హత్యల మాఫీ పధకంగా అభివర్ణించారు. తన పార్టీ నేతలు ఎన్ని తప్పులు చేస్తున్నా బీజేపీ క్షమిస్తూ పోతోందన్నారు. ఈ వ్యవహారంలో నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు