Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని పీఠం : నరేంద్ర మోడీకి అరవింద్ కేజ్రీవాల్ పోటీ!

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2014 (09:13 IST)
File
FILE
2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి పీఠానికి పోటీ పడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఆ పోటీని ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మూడో స్థానానికి పడిపోయాడు.

ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని పీఠానికి పోటీ చేయాలని 25 శాతం మంది కోరుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో 44 శాతం మెట్రో నగర వాసులు ఏఏపీకి ఓట్లు వేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇప్సోసోలు సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వలో వెల్లడైంది.

దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేను ఈనెల మూడు నుంచి ఏడో తేదీ మధ్య నిర్వహించారు. 18-45 యేళ్ల మధ్య స్త్రీ పురుషులను సర్వే చేశారు.

ఇందులో ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న వారిలో బీజేపీ నేత నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ మూడో స్థానానికి దిగజారాడు.

ఈ సర్వే ప్రకారం... ఉత్తమ ప్రధాన మంత్రిగా మోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనకు 58 శాతం మంది ఓటేయగా.. 25 శాతం ఓట్లతో రెండో స్థానంలో కేజ్రీవాల్ ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 14 శాతంతో మూడో స్థానానికి పడిపోయారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments