Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయర్‌పై వ్యక్తిగత కక్ష లేదు : ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2012 (11:58 IST)
ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్‌పై తనకు వ్యక్తిగత కక్ష లేదా విభేదాలు లేవని ప్రస్తుత ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. ఎస్ బ్యాండ్‌ల కేటాయింపు కోసం కుదుర్చుకున్న యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిన మాట నిజమేనని ఆయన చెప్పుకొచ్చారు.

తనపై మాధవన్ నాయర్ ఇటీవల చేసిన ఆరోపణలపై రాధాకృష్ణన్ బుధవారం స్పందించారు. ఇస్రో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే ఒప్పందంలో చేటు చేసుకున్న అవినీతిని బయటపెట్టినట్టు ఆయన తెలిపారు. అంతేకానీ, నాయర్‌పై తనకు వ్యక్తిగత కక్షలు ఏమీ లేవన్నారు.

ఇదిలావుండగా, అంతరిక్ష రంగంలో ఎస్-బ్యాండ్ స్కాంను తవ్వితీసిన కీలక నివేదికలు త్వరలోనే వెలుగు చూడనున్నాయి. ఇస్రో మాజీ అధిపతి మాధవన్ నాయర్ హయాంలో కుదిరిన యాంత్రిక్స్- దేవాస్ ఒప్పందం కారణంగా ఖజానాకు వేలాది కోట్ల రూపాయల గండి పడిందని మొత్తం మూడు కమిటీలు ఇప్పటికే నిర్ధారించడం, వీటి ఆధారంగా నాయర్, మరో ముగ్గురు శాస్త్రవేత్తలపై కేంద్ర ప్రభుత్వం వేటు వేయడం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments