Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ రాజకీయాలపై తమిళ తంబి ఫలితాలు: ఏచూరీ

Webdunia
దేశ రాజకీయాలపై తమిళ ఓటర్లు ఇచ్చే తీర్పు పెను ప్రభావం చూపుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ అన్నారు. ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడుతూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ రాష్ట్రానికి మాత్రమే సంబంధించినవి కావని, దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయన్నారు.

కేంద్ర రాష్ట్రాల్లోని యూపీఏ, డీఎంకే సంకీర్ణ ప్రభుత్వాలు రాష్ట్రంలో అవినీతి, కుంభకోణాలలో భాగం పంచుకున్నాయన్నారు. యూపీఏ ప్రభుత్వం 2జి స్పెక్ట్రమ్‌, కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణ, ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ తదితర అవినీతి కుంభకోణాలతో పాలన సాగిస్తోందన్నారు. 2జి స్పెక్ట్రమ్‌లో కోల్పోయిన సొమ్ముతో దేశంలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేయవచ్చన్నారు.

ఆహారం లేక ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఐదుగురు పిల్లలు మరణిస్తుండగా, వారిలో ముగ్గురు మన దేశంలోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి కుంభకోణాల సొమ్ముతో వారికి ఒక పూట అన్నం పెట్టవచ్చన్నారు. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు నిరుపేదలుగా మారుతున్నారని సీతారాం ఏచూరీ అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments