Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరపైకి బుందేల్‌ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు తాజా డిమాండ్!

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2009 (17:47 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావును స్ఫూర్తిగా తీసుకున్న బుందేల్‌ఖండ్ ముక్తి మోర్చా నేతలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తీవ్రస్థాయిలో ఆందోళన చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తమ లక్ష్య సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

దీనిపై బుందేల్‌ఖండ్ ముక్తిమోర్ఛా అధ్యక్షుడు రాజా బుందేలా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం తాము పోరాటం చేయనున్నట్టు ప్రటించారు. ఇందుకోసం తెరాస అధినేత ఎంచుకున్న మార్గాన్నే అనుసరించనున్నట్టు ప్రకటించారు. దశాబ్దాల కాలంగా చేసిన ఆందోళనకు ప్రతిఫలం లభించిందన్నారు.

అలాగే, బుందేల్‌ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు తాము కూడా ఇదే తరహా స్థాయిలో ఆందోళన చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం గత 20 సంవత్సరాలుగా తాము పోరాడుతున్నామన్నారు. ప్రత్యేక స్వయంప్రత్తి లేనిదే తమ ప్రాంతం అభివృద్ధి అసాధ్యమని తమ ప్రజలు గుర్తించారని చెప్పారు. అందుకే ఉద్యమానికి కొత్త ఊపు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ఇందుకోసం ఈనెల 16వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూత్ నుంచి కామతాథ్ వరకు 300 కిలోమీటర్ల లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. తమ డిమాండ్ పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టనున్నట్టు ప్రకటించారు. బుదేల్‌ఖండ్ కూడా తెలంగాణలాంటి సమస్యే అని ఆయన చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments