Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేడీయూ, ఏడీఎంకేలతో కాంగ్రెస్ పొత్తు: షీలా

Webdunia
FileFILE
బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీ(యు), తమిళనాడు ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వంటి పార్టీలతో ఎన్నికల తరువాత పొత్తుపై కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్నికల తరువాత ఆ రెండు పార్టీలతో చెలిమి కుదురుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం బాగా పని చేసింది. అందరూ అదే చెబుతున్నారు. నితీశ్ కుమార్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ప్రజల వ్యక్తి అని దేశవ్యాప్తంగా నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో షీలాదీక్షిత్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అన్నాడీఎంకేతో పొత్తుకు కూడా అవకాశాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఢిల్లీ ముఖ్యమంత్రి సమాధానమిస్తూ.. ఇవన్నీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొందే సీట్లపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. మతతత్వ శక్తులతో కాకుండా, మిగిలిన పార్టీలతో జతకట్టేందుకు అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయని తెలిపారు.

ఇటువంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో పొత్తు సాధ్యమా అని అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ సాధ్యమేనని సమాధానమిచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా నితీశ్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడులను ప్రశంసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్నికల తరువాత లెఫ్ట్ పార్టీలు తమకు మద్దతు ఇస్తాయని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments