Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్జిల బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం

Webdunia
న్యాయమూర్తుల ఆస్తులపై రూపొందించిన వివాదాస్పద బిల్లు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం వెనుకడుగువేసింది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లుపై ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నడవడంతో పాలకపక్షం దానిని వెనక్కు తీసుకోకతప్పలేదు.

ఈ ప్రతిపాదిత బిల్లు న్యాయమూర్తులు వారి ఆస్తులను బహిరంగంగా వెల్లడించకుండా రక్షణ కల్పిస్తుంది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించాయి. దీంతో యూపీఏ సర్కారుకు పార్లమెంట్‌లో తొలి షాక్ తగిలింది. ఫలితంగా న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడికి సంబంధించిన ఈ వివాదాస్పద బిల్లును రాజ్యసభ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ఏకాభిప్రాయం సాధించిన తరువాత బిల్లును మళ్లీ తెస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సిద్ధాంతపరంగా బద్ధశత్రువులైన లెఫ్ట్, బీజేపీలు ఈ బిల్లు విషయంలో ఏకతాటిపై నిలిచి పోరాడటం సోమవారం రాజ్యసభలో చోటుచేసుకున్న ఓ అరుదైన పరిణామం. న్యాయమూర్తులు ఆస్తుల వివరాలు వెల్లడించకుండా బిల్లులో రక్షణ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

ఈ ఆరోపణలకు కాంగ్రెస్ సభ్యురాలు జయంతి నటరాజన్ కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం. బిల్లుపై ఏకాభిప్రాయం సాధించిన తరువాత తిరిగి తీసుకొస్తామని ఈ సందర్భంగా న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ రాజ్యసభకు తెలియజేశారు. ఈ బిల్లుకు సభలో ఆమెదం లభించాలంటే ఏకాభిప్రాయం సాధించడమొక్కటే యూపీఏకి ఉన్న మార్గం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments