Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి ఊరట

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2012 (12:58 IST)
File
FILE
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి బుధవారం గుజరాత్ హైకోర్టులో ఊరట లభించింది. 2002 సంవత్సరంలో జరిగిన గోద్రా అలర్ల కేసులో జస్టిస్ నానావతి-మెహతా కమిషన్ ముందు హాజరుకావలసిన పనిలేదని తేల్చిచెప్పింది. నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ముగ్గురు అధికారులను తిరిగి విచారించాలని కమిషన్‌కు కొంతమంది బాధితులతో కలపి ఎన్‌జిఓ, జన్‌ సంఘర్ష్ మంచ్ ఒక పిటిషన్‍‌ను దాఖలు చేశారు.

ఎన్‌జిఓ సంస్థ ముఖ్యమంత్రి మోడీ పాత్రపై కమిషన్ సంఘం తీసుకొన్న నిర్ణయం విస్తృతి పరిధిలోకి వస్తుందని వారు ఉద్ఘాటించారు. జస్టిస్ అఖిల్ ఖురేషి, సోనియా గోకాని‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ అనంతరం కేసు కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. కేసు క్రాస్ ఎగ్జామినేషన్ విషయంలో కమిషన్‌కు ఎలాంటి అధికారాలు లేవని, బలవంతంగా విచారించటం సాధ్యం కాదని తెలిపింది.

కమిషన్‌లోని న్యాయవాదులు జస్టిస్ నానవతి, జస్టిస్ అక్షయ్ మెహతా కమీషన్ ముందు ప్రత్యేకంగా హాజరు కావాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసినదే. కాగా ఈ కేసు విషయంలో సుప్రీంకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు జెఎస్‌ఎం లాయర్ ముకుల్ సిన్హా తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments