Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో రాజస్థాన్ గవర్నర్ ప్రభారావు మృతి

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2010 (15:17 IST)
రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ ప్రభారావు సోమవారం కన్నుమూశారు. ఆమెకు గుండెపోటు రావడంతో న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య వైజ్ఞాన సంస్థలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.

75 సంవత్సరాల రావు జోధ్‌పూర్‌లోని తన అధికారిక నివాసంలో సోమవారం ఉదయం బాత్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన సహాయ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలిచినట్టు ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఆ తర్వాత ఆమె మృతి చెందినట్టు చెప్పారు.

ప్రభారావు మరణ వార్తను తెలుసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రికి వెళ్లి అంజలి ఘటించారు. అలాగే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా జైపూర్ నుంచి ఢిల్లీకి హుటాహుటిన చేరుకున్నారు. మహారాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షురాలిగా పని చేసిన ప్రభారావు గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగారు. గత జనవరిలో ఆమెను రాజస్థాన్ గవర్నర్‌గా కేంద్రం నియమించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments