Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరంలో మరో గ్యాంగ్ రేప్... 17 ఏళ్ల యువతిపై 'ఫేస్‌బుక్' ఫ్రెండ్

Webdunia
బుధవారం, 2 జనవరి 2013 (13:39 IST)
FILE
ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన మరువక మునుపే కొత్త ఏడాది 2013 కొత్త సంవత్సరంనాడు మరో అత్యాచారం జరిగింది. 17 ఏళ్ల యువతిపై ఆమె ఫేస్ బుక్ ఫ్రెండ్ మరో స్నేహితునితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే... జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై డిసెంబరు 31 అర్థరాత్రి ఆమె ఫేస్ బుక్ స్నేహితుడు మరో స్నేహితుడితో కలిసి ఢిల్లీలోని సప్దర్జంగ్ ఎంక్లేవ్ ప్రాంతంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... తన ఫేస్ బుక్ ఫ్రెండ్ డిసెంబరు 31 అర్థరాత్రి తనను పార్టీకి ఆహ్వానించాడు.

పార్టీకి పిలిచి అతడు ఓ అపార్ట్ మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అతడు మరో ఫ్రెండ్‌తో కలిసి తనకు డ్రింక్ ఆఫర్ చేశాడు. అయితే ఆ పానీయంలో మత్తు మందు కలుపడంతో తను అపస్మారక స్థితిలోకి వెళ్లాననీ, ఆ సమయంలో ఇద్దరూ కలిసి తనపై అత్యాచారం జరిపారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని తేలడంతో నిందితులిద్దరిపైనా సెక్షన్ 376/34 కేసు కేసు నమోదు చేశారు.

కాగా అత్యాచారానికి పాల్పడ్డ నిందితులిద్దరూ 20 ఏళ్ల మధ్యవయస్కులు. ఒకడు ఐటీ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తుండగా మరో యువకుడు ఎమ్ఎన్సీ కన్సెల్టెన్సీలో మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు