Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రుల విదేశీ పర్యటనలకు బ్రేక్: పీఎంఓ ఆదేశం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2011 (13:09 IST)
కేంద్ర మంత్రులు విదేశీ పర్యటనలకు ప్రధానమంత్రి కార్యాలయం బ్రేక్ వేసింది. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్న తరుణంలో స్వదేశీయంగా పొదుపు మంత్రాన్ని కేంద్రం పాటిస్తోంది. ఇందులోభాగంగా విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పీఎంఓకు వచ్చిన 20 మంత్రుల ఫైళ్లను ప్రధానమంత్రి నిర్ద్వంద్వంగా తిరిగి వెనక్కిపంపారు.

ఇటీవలికాలంలో కేంద్ర మంత్రులు విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయలను వృధా చేస్తున్నారు. ఈ ఖర్చు ఏ యేడాదికి ఆ యేడాది పెరిగిపోతోంది. దీంతో అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని మంత్రివర్గ సహచరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ.. ప్రభుత్వ ఖర్చులతో విదేశాలకు వెళ్లాలని ఆశపడే మంత్రుల సంఖ్య మాత్రం తగ్గలేదు. తాజాగా 24 మంది మంత్రులు విదేశాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పీఎంఓకు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఫైళ్లు వచ్చాయి. వీటిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతకం చేయకుండా తిరిగి వెనక్కి పంపారు.

విదేశీ పర్యటనల కోసం అనుమతి కోరుతూ ఫైళ్లు పంపించిన మంత్రుల్లో వాయిలార్ రవి (కెనడా), ఫరూక్ అబ్దుల్లా (జర్మనీ, ఇటలీ), సల్మాన్ ఖుర్షీద్ (దోహా, కరోలినా), సుషీల్ కుమార్ షిండే (లండన్), కుమారి సెల్జా (కెన్యా, హంగేరి), జైరామ్ రమేష్ (న్యూయార్క్), సుభోధ్‌కాంత్ సహాయ్ (థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియా, కెనడా), ఎంఎస్.గిల్, జితిన్ ప్రసాద్, సచిన్ పైలట్, అశ్విన్ కుమార్, అజయ్ మాకెన్, భరత్ సిన్హ్ సోలంకి తదితరులు ఉన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments