Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో కొనసాగుతున్న అల్లర్లు: 15 మంది మృతి!

Webdunia
FILE
జమ్మూ కాశ్మీర్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం నుంచి జరుగుతున్న అల్లర్లతో మృతుల సంఖ్య సోమవారానికి 15 మందికి చేరింది. అల్లర్లను అదుపులోకి తీసుకునేందుకు కర్ఫ్యూ విధించారు.

ఆందోళనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్, నీటి బాంబులు పేల్చడం, తుపాకీ కాల్పులు జరుపుతుండటంతో జమ్మూలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. ఫలితంగా భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటాయి.

ఈ అల్లర్లలో గత శుక్రవారం దక్షిణ కాశ్మీర్‌లో థారిక్ అహ్మద్ అనే వ్యక్తి తీవ్ర గాయానికి గురైయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన థారిక్ ఆదివారం రాత్రి మరణించడంతో మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఆదివారం మాత్రం ఎనిమిది మంది మరణించారు.

ఇంకా జమ్మూలో పరిస్థితి ఉద్రికంగా మారడంతో పది జిల్లాల్లో భారీ భద్రతా బలగాలను మోహరించారు. దీనితో పాటు కర్ఫ్యూను కూడా విధించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నెలకొన్న పరిస్థితులపై భద్రత మండలి ఆదివారం రాత్రి సమావేశమైంది.

మరోవైపు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జమ్మూలో ప్రస్తుతం నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చలు జరిగాయని సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments