Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోతుందా..? కలిసే ఉంటుందా..?

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2011 (19:59 IST)
FILE
రాష్ట్రంలో గత రెండేళ్లుగా నలుగుతున్న తెలంగాణ సమస్యకు చరమ గీతం పాడేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించినట్లు కనబడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ మాటలే ఇందుకు నిదర్శనం.

తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆజాద్ ఢిల్లీలో జాతీయ మీడియాతో అన్నారు. పౌర్ణమి తర్వాత ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణపై ప్రకటన పార్టీ పరంగా ఉండదనీ, ప్రభుత్వమే చేస్తుందని చెప్పుకొచ్చారు.

గతంలో తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారనీ, మళ్లీ ఆయనే తెలంగాణపై ఓ ప్రకటన చేస్తారని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను కాంగ్రెస్ అధిష్టానంతో కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు.

ఇదిలావుంటే యూపీఎ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో మంగళవారంనాడు ఆజాద్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో తెలంగాణపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి పౌర్ణమి తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోతుందా..? లేదంటే కలిసే ఉంటుందా..? వెయిట్ అండ్ సీ.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments