Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో భాజపా మహిళా మంత్రి శోభా రాజీనామా!

Webdunia
సోమవారం, 9 నవంబరు 2009 (17:15 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పకు అత్యంత నమ్మకస్తులైన మంత్రులుగా వారిలో మహిళా మంత్రి శోభా కరందలజే ఒకరు. ఈమె సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అందజేశారు. ఇదే కోవలో మరో ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు సమాచారం.

కర్ణాటక రాజకీయ సంక్షోభం పరిష్కరించే దిశగా కేంద్ర నాయకత్వం సమక్షంలో ముఖ్యమంత్రికి, అసమ్మతి నేత గాలి జనార్ధన్ రెడ్డికి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నలుగురు మంత్రులను బీఎస్ తొలగించాల్సి వుంది. వారిలో ఒకరైన శోభా తన కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక మంత్రివర్యుల్లో ఉన్న ఏకైక మహిళా మంత్రి ఈమె కావడం గమనార్హం.

సంక్షోభం పూర్తి కాకముందే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వీపీ.బాలిగర్‌పై వేటు వేసిన విషయం తెల్సిందే. అయితే, సంక్షోభం ముగిసిన తర్వాత ఆదివారం రాత్రి బెంగుళూరుకు చేరుకున్న యడ్యూరప్ప మాత్రం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రుల తొలగింపునకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేసిన 24 గంటలు పూర్తి కాకముందే మంత్రి శోభా రాజీనామా చేయడం గమనార్హం.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments