Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణ లేని సమయంలో మారన్ బ్రదర్స్ ఇళ్లపై సోదాలు!

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2011 (13:24 IST)
తమిళనాడు రాజకీయ వృద్ధనేత, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి చెన్నయ్ నగరంలో లేని సమయాన్ని సీబీఐ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర టెలికామ్ మాజీ మంత్రి, సెంట్రల్ చెన్నయ్ డీఎంకే ఎంపీ దయానిధి మారన్, ఆయన సోదరుడు, సన్ టీవీ అధిపతి కళానిధి మారన్ నివాసాల్లో సీబీఐ సోమవారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.

వీరిద్దరితో పాటు.. మ్యాక్సిస్ కంపెనీ అధినేత అనంతకృష్ణన్ నివాసంలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరు నివాసాలన్నీ చెన్నయ్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న బోట్ క్లబ్‌ ఏరియాలో ఉంది.

ఈ తనిఖీల విషయం తెలుసుకున్న వెంటనే దయానిధి మారన్ నివాసానికి కరుణానిధి తరపున ఆయన పెద్ద కుమారుడు ఎంకే. తమిళరసు చేరుకున్నారు. అయితే, సీబీఐ అధికారులు ఆయనను లోనికి అనుమతించలేదు. ఫలితంగా ఆయన గేటు బయటే వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

వాస్తవానికి ఈ తనిఖీలు జరిగే సమయంలో కరణానిధి చెన్నయ్ నగరంలో లేకపోవడం గమనార్హం. ఆయన తిరుచ్చి వెస్ట్ ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆదివార రాత్రి తిరుచ్చికి వెళ్లి, సోమవారం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

దీన్ని అవకాశంగా చేసుకున్న సీబీఐ తనిఖీలు చేసింది. ఈ తనిఖీలు చేసిన వారి నివాసాల్లో మారన్ బ్రదర్స్‌ గృహాలతో సహా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధిపతి ప్రతాప్ సి రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, ఆస్ట్రా టీవీ సీఈఓ రాల్ఫా మార్షల్, ప్రముఖ వ్యాపారవేత్త టి అనంతకృష్ణన్‌లు ఉన్నారు. వీరిపై ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందంలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్‌ను ఇప్పటికే నమోదు చేసిన విషయం తెల్సిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments