Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒబామా- మన్మోహన్‌ల భేటీ: ద్వైపాక్షిక అంశాలపై చర్చ

Webdunia
FILE
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనలో కీలక ఘట్టం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటన చేపట్టిన బరాక్ ఒబామా ఇండో-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో సోమవారం హైదరాబాద్ హోస్‌లో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్- ఒబామాల మధ్య తీవ్రవాదం, న్యూక్లియర్, అవుట్‌సోర్సింగ్‌పై అమెరికా వైఖరి వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి. ఈ భేటీలో ఒబామా, మన్మోహన్ సింగ్‌లతో పాటు దేశ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోంమంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి ఆంటోనీ, విదేశాంగ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు.

ఆప్ఘనిస్థాన్‌లో తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు పాకిస్థాన్ మైత్రి అవసరమని భావిస్తున్న ఒబామా, భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు అవసరమనే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.

బరాక్ ఒబామాతో విదేశీ గడ్డపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదుసార్లు భేటీ కాగా, అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత గడ్డపై తొలిసారి భేటీ కావడం ఇదే మొదటిసారి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments