Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులను అణచడానికే సైనిక సంపత్తి: ఆంటోనీ

Webdunia
FILE
అగ్రదేశమైన అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని పాకిస్థాన్ అల్‌ఖైదా లాంటి ఉగ్రవాదులను అణచడానికే ఉపయోగించాలని భారత రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. అమెరికా అందిస్తున్న సైనిక ఆయుధ సంపత్తిని పాకిస్థాన్ భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూసే బాధ్యత అమెరికాపై ఉందని ఆంటోనీ స్పష్టం చేశారు.

ఇలాంటి చేదు అనుభవాలను భారత్ గతంలో ఎదుర్కొందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమెరికా పూర్తి బాధ్యత వహించాలని ఆంటోనీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదిలా ఉంటే.. తాలిబన్‌, అల్‌ఖైదా తీవ్రవాదులను తుదముట్టించేందుకు పాక్‌కు వివిధ రకాల ఆయుధాలను సరఫరా చేస్తూ వారి ఆయుధ సంపత్తి అమెరికా పెంచుతోంది. లేజర్‌-గైడెడ్‌-బాంబ్‌ కిట్స్‌, 12 అమెరికాలో తయారుచేసిన ద్రోన్‌లు, 18 లేట్‌- మోడల్‌ ఎఫ్‌-16 ఫైటర్లను పాక్‌కు అమెరికా సరఫరా చేయనుందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమెరికా సరఫరా చేసే ఆయుధాలతో పాకిస్థాన్ నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments