Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిపై మరో స్వాతంత్ర్యం పోరాటం: అన్నా హజారే

Webdunia
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతిపై మరో స్వాతంత్య్ర పోరాటం జరపాలని ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అననా హజారే పిలుపునిచ్చారు. అంతేకాకుండా, దేశానికి ఇప్పటికీ నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి నిజమైన స్వాతంత్య్రాన్ని సాధించేందుకు, అవినీతిని అంతమొందించేందుకు రెండో స్వాతంత్య్ర సంగ్రామాన్ని మొదలెట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.

భారత్‌కు అసలైన స్వాతంత్య్రాన్ని సాధించేందుకు.. జైలుకెళ్లేందుకైనా మనం సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి వ్యతిరేక భారత్ ర్యాలీని ఉద్దేశించి ఆయన పుణేలో మాట్లాడారు అవినీతిపై ఎక్కువెప్టిటన లోక్‌పాల్ బిల్లు నిర్దేశించిన సమయంలోగా ఆమోదం పొందకపోతే.. మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దీనికి సన్నద్ధం కావాలంటూ జాతికి పిలుపునిచ్చారు.

జన్ లోక్‌పాల్ బిల్లు చట్టంగా రూపొందిన మరుసటి క్షణం నుంచి దేశంలో అవినీతి నిర్మూలన ప్రారంభమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన ప్రతిబంధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న ప్రతి రూపాయిలోనూ 10 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతోందన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments