Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణు భద్రతపై రాజీపడేది లేదు: స్పష్టం చేసిన మన్మోహన్

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2011 (12:04 IST)
కూడంకుళంతో సహా దేశంలో నిర్మించే అణు విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు భద్రతైపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెల్సిందే. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి ఓ.పన్నీర్ సెల్వం నేతృత్వంలోని మంత్రివర్గం బృందం ప్రధానితో సమావేశమైంది.

ఈ సందర్భంగా వారితో ప్రధాని మాట్లాడుతూ కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌పై వ్యక్తమవుతున్న సహేతుక భయాలను తీర్చడానికి ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అణుశక్తి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని తెగేసి చెప్పారు.

సమాజంలోని ఏ వర్గం ప్రజలు, ముఖ్యంగా ప్రాజెక్టులకు సమీపంగా ఉన్నవారి భద్రత, జీవనోపాధికి హాని కలిగించే రీతిలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోదని వారికి తెలిపారు. దేశంలోని వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు వచ్చే డిసెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments