Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి కుమారునికి వ్యతిరేకంగా కాంగ్రెస్: భాజపా

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2009 (11:53 IST)
మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా.. అమరావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కుమారుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. పాటిల్ కుమారుడిని ఎన్నికల్లో ఓడించేందుకు తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన సునీల్ దేశ్‌ముఖ్ వెనుక కేంద్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ హస్తం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ ముండే ఆరోపించారు.

దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన నేతల్లో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయినప్పటికీ.. కూటమి అభ్యర్థులకు మద్దతుగా పార్టీ శ్రేణులన్నీ పని చేస్తున్నాయని తెలిపారు. ప్రధానంగ ా... రాష్ట్రపతి కుమారుడు రావుసాహెబ్ షెకావత్‌కు అనుకూలంగా పని చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జగదీష్ గుప్తాతో పాటు.. ఇతర నేతలు సైతం పార్టీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులో రాష్ట్రపతి కుమారుడికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ముండే ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి భాజపా-ఆర్.ఎస్.ఎస్‌కు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments