Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరాజుద్దౌలా రాజధాని ముర్షీదాబాద్

Webdunia
గురువారం, 15 మే 2008 (20:10 IST)
ఆంగ్లేయుల సమయంలో బెంగాల్‌ను పాలించిన నవాబు సిరాజుద్దౌలా రాజధాని నగరం ముర్షీదాబాద్. ముస్లింల పాలనా కాలంలో ఈ ప్రాంతంలో అనేక కట్టడాలను ఇక్కడ నిర్మించారు. భాగీరథి నది ఒడ్డున ముర్షీదాబాద్ నగరం ఉంది. భారత చరిత్రను మలుపుతిప్పిన అనేక అంశాలకు వేదిక ముర్షీదాబాద్. ఈ ప్రాంతం నుంచి అప్పట్లో కోల్‌కతా నౌకాశ్రయం ద్వారా వర్తకం జరిగేది.

ముర్షీద్ ఖులీ ఖాన్ నవాబు పేరిట ఈ నగరానికి ముర్షీదాబాద్ పేరు వచ్చింది. సుబే బంగ్లాకు రాజధాని ముర్షీదాబాద్. సుబే బంగ్లా అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాలతో కూడిన ప్రాంతం. ప్లాసీ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇక్కడ చాలా ఏళ్లు స్థావరాలు ఏర్పాటుచేసుకుని నివశించారు.

చరిత్రలో ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇక్కడ బౌద్ధం, బ్రాహ్మణం, వైష్ణవం, జైన, ఇస్లాం, క్రైస్తవ మతాలు ఇక్కడ విలసిల్లాయి. ఐరోపాకు చెందిన డచ్, బ్రిటీష్, ఫ్రెంచ్, ఆర్మేనియన్లు ముర్షీదాబాద్‌లో నివశించారు.

బ్రిటీష్ వారి హయాంలో 1717లో బెంగాల్ ప్రావిన్స్‌కు రాజధానిగా ముర్షీదాబాద్‌ ఉండేది. ప్లాసీ యుద్ధం తర్వాత అంటే 1773లో రాజధానిని కోల్‌కతాకు బ్రిటీష్ వారు మార్చారు.

చూడవలసిన ప్రాంతాలు

హజార్‌ద్వారీ

శాస్త్రీయమైన వాస్తుకళతో హజార్‌ద్వారీని నిర్మించారు. హజార్‌ద్వారీ అంటే వేయి తలపులు భవంతి. ఈ భవంతిని నవాబ్ నజీమ్ కోసం 1837లో డంకన్ మెక్‌లాడ్ నిర్మించారు. హజార్‌ద్వారీ భవంతిలో ప్రస్తుతం వస్తు ప్రదర్శన శాల ఉంది. ఇందులో అనేక కళాఖండాలను భద్రపరిచారు.

హజార్‌ద్వారీ భవంతిలో 114 గదులు ఉన్నాయి. ఈ భవంతిని 41 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించారు. ఇదే భవంతిలో గ్రంధాలయం కూడా ఉంది. ఈ భవంతి పరిసరాల్లో మదీనా అనే మసీదు, వాసెఫ్ మంజిల్, త్రిపోలియా గేట్, దక్షిణ దర్వాజా, ఛాక్ దర్వాజాలు ఉన్నాయి.

ఇమాంబారా
హజార్‌ద్వారీ భవంతికి ఉత్తరంగా ఇమాంబారాను 1847లో నవాబు మన్సూర్ ఆలీ ఖాన్ నిర్మించారు. దీని నిర్మాణానికి ఆ రోజుల్లో రూ.6లక్షలు వ్యయం అయింది. ఆ తర్వాత కాలంలో సిరాజుద్దౌలా దీనిని తగులబెట్టాడు. బెంగాల్ ప్రాంతంలో అతిపెద్ద ఇమాంబారా ఇది ఒక్కటే.

ముర్షీదాబాద్ సమీపంలో కథ్‌గోలా వద్ద జైన్ పార్శ్వనాధ్ దేవాలయం, బారన్‌గోర్ వద్ద 18వ శతాబ్దంలో రాణి భవానిచే నిర్మించిన ఛార్ బంగ్లా దేవాలయం, భవానీశ్వర్ దేవాలయం ఉన్నాయి.

వసతి
పశ్చిమ బెంగాల్ పర్యాటక సంస్థకు చెందగిన హోటళ్లతో పాటుగా ఇతర వసతి సదుపాయం ఉంది.

ఎలా చేరుకోవాలి

విమాన మార్గం : కోల్‌కతా (221 కి.మీ.) సమీపంలో విమానాశ్రయం.
రైలు మార్గం : కోల్‌కతాలోని హౌరా, సీల్డాల నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది.
రహదారి మార్గం : కోల్‌కతా నుంచి 221 కి.మీ. దూరంలో ముర్షీదాబాద్ ఉంది.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments