Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ప్రపంచ ఏడు వింతల" పోటీకి 28 పేర్లు ఖరారు

Webdunia
ప్రపంచంలోని ఏడు వింతలను కొత్తగా నిర్ధారించేందుకు జరుపుతున్న పోటీ చివరిదశ ఓటింగ్‌కు 28 వింతల పేర్లు ఖరారయ్యాయి. కాగా... స్విట్జర్లాండ్‌కు చెందిన బెర్నార్డ్ వెబర్ నేతృత్వంలోని "న్యూ సెవెన్ వండర్స్" అనే సంస్థ ఈ ఓటింగ్‌ను నిర్వహిస్తోంది.

ఈ తుది జాబితాలో స్థానం సంపాదించుకున్న వాటిలో ది గ్రాండ్ కాన్యాన్, మాట్టెర్‌మార్న్, గ్రేట్ బారియర్ రీఫ్, అమెజాన్‌లోని వేలాడే తోటలు, డెడ్ సీ, ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజరో, ఈక్విడార్‌లోని గలపగోస్ దీవులు, అజర్‌బైజాన్‌లోని మట్టి అగ్ని పర్వతాలు, ఐర్లాండ్‌లోని మెహర్ శిఖరాలు, జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లు కూడా స్థానం సంపాదించాయి.

ఏడు వింతలను ఎన్నుకునేందుకు ప్రపంచంలోని ప్రజలందరూ ఇంటర్నెట్‌లోగానీ, ఫోన్ ద్వారాగానీ తమ ఓటును వేయవచ్చు. తుది ఫలితాలను 2011వ సంవత్సరంలో ప్రకటిస్తారు. రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా ప్రపంచ ఏడు వింతలను ఓటింగ్ ద్వారా ఖరారు చేసిన సంగతి పాఠకులకు విదితమే.

ఈ సందర్భంగా వెబర్ మాట్లాడుతూ... సుమారు వంద కోట్ల మంది ప్రజలు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని తాము అంచనా వేస్తున్నట్లు ఒక వార్తా సంస్థలకు వెల్లడించారు. తొలిదశ పోలింగ్‌లో 77 అద్భుతాలకు వచ్చిన ఓట్లను బట్టి నిపుణుల కమిటీ 28 పేర్లను ఖరారు చేసినట్లు వెబర్ తెలిపారు. ముందుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు 261 వింతలను ఈ పోటీకి సూచించటం గమనార్హం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments