Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లా, పెద్దా అందరినీ అలరించే నయాగరా

Webdunia
బుధవారం, 5 మార్చి 2008 (17:33 IST)
అమెరికా, కెనడా సరిహద్దుల మధ్య ప్రవహించే చిన్న నదిగా నయాగరా తన ప్రయాణాన్ని సాగిస్తుంటుంది. మొత్తం 60.కి.మీ.ల పొడవుతో నయాగరా నది అలరారుతోంది. ప్రపంచంలోని అత్యంత వెడల్పైన జలపాతంగా నయాగరా జలపాతం పేరొందింది. మొత్తం పొడవుతో, 180 అడుగుల వైశాల్యంతో ఉన్న ఈ జలపాతాలను చూడడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. విదేశీ పర్యాటకులు తమ సందర్శనీయ ప్రాంతాల జాబితాలో తప్పక చేర్చవలసినవిగా నయాగరా జలపాతాలు వాసికెక్కాయి.

నింగి నుంచి నేలకు జారుతున్నట్లుగా సాగే నయాగరా జలపాతాలను రెండు రూపాల్లో చూడవచ్చు. కెనడా భూభాగంలో 2000 అడుగుల వెడల్పుతో 140 అడుగుల ఎత్తు నుంచి కిందపడే దృశ్యం కనులపండుగగా ఉంటుంది. అమెరికా భుభాగంలోని నయగారా జలపాతం కెనడా జలపాతం కన్నా ఎక్కువ ఎత్తు నుంచి పడుతున్నప్పటికీ తక్కువ వెడల్పును కలిగి ఉంటుంది. ఈ జలపాతం అమెరికాలోని డెట్రాయిట్ రాష్ట్రానికి సుమారు 300 మైళ్ల దూరంలో ఉంది.

జలపాతానికి దగ్గరగా ఓ వైపున కట్టిన రాక్‌లోంచి జలపాతాన్ని దగ్గరగా చూడడం చెప్పలేని మధురానుభూతి. అలాగే ఓ అద్దాల లిఫ్టులో రెయిన్ కోట్ వేసుకుని 125 అడుగుల లోతుకు తీసుకెళ్లే ఏర్పాటు సందర్శకులకు చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది పర్యాటకులు నిత్యం నయాగరాను సందర్శిస్తుంటారు.

నయాగరాకు సమీపంలో చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో... ఒకటి మెరైన్ ల్యాండ్. ఇక్కడ సీ లయన్లు, తిమింగలాలు తదితర నీటి జంతువులు అందరినీ ఆకర్షిస్తాయి. వాటిని దగ్గరగా చూడొచ్చు, తాకొచ్చు కూడా. అలాగే మానావాళి పట్ల ప్రత్యేక శ్రద్దను చూపే డాల్ఫిన్ల షో ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. అలాగే అక్కడ ఉన్న బొటానికల్ గార్డెన్‌లో ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో పూసే 2300 రకాల గులాబీలు వర్ణశోభితమై అలరారుతుంటాయి. వీటితో పాటు సీతాకోక చిలుకల కన్జర్వేటరీలోని 2000 రకాల సీతాకోక చిలుకలు అన్ని వయస్సుల వారిని ఆకట్టుకుంటున్నాయి.

అలాగే కెనడా వైపు కాకుండా అమెరికా వైపు కూడా వెళ్లి దీనిని చూడొచ్చు. ఇది అమెరికన్ ఫాల్స్, కెనడా ఫాల్స్‌ మధ్యన ఉంటుంది. ఈ ప్రాంతంలో అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వీల్ పేర్లతో రెండు జలపాతాలున్నాయి. కెనడా వైపు లాగానే ఇక్కడ కూడా లిఫ్టులో జలపాతం వద్దకు వెళ్లి దగ్గరగా చూసీ ఆస్వాదించవచ్చు. పిల్లలు, పెద్దవారు. ప్రేమికులని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ చూసి ఆనందించే ప్రాంతం నయాగరా.

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

Show comments