Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన పర్వత ప్రాంతం కొడైకెనాల్

Webdunia
తమిళనాడు రాష్ట్రంలో దాదాపు మధ్య ప్రాంతంలో గల సుందరమైన పర్వతప్రాంతం కొడైకెనాల్. దక్షిణ భారతదేశంలోని వేసవి విడిదిగా ఈ ప్రాంతం సుపరిచితమే. తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఘాట్‌రోడ్‌లో ప్రయాణించాల్సిందే. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రెండు వేసవి విడుదులలో ఊటి తర్వాత కొడైకెనాల్‌దే స్థానం.

పర్వతప్రాంతమైన ఈ ప్రాంతం ఎల్లప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఏడాది పొడవునా ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఉన్నా వేసవిలో మాత్రం రద్దీ బాగా ఉంటుంది.

కొడైకెనాల్‌లో చూడదగ్గ ప్రదేశాలు
కొడైకెనాల్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కొడై సరస్సు, సెయింట్ మేరీ చర్చ్, పంపార్ పాల్స్, గ్రీన్ వ్యాలీ, గుణ గుహ, పైన్ వృక్షాల వనం, కురింజి స్వామి దేవాలయం మొదలుగునవి పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇందులో కొడై సరస్సు అనేది ఓ అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు.

ఇది కొడైకెనాల్ పట్టణానికి దాదాపుగా నడిబొడ్డున ఉంది. ఇందులో బోటు షికారు చేయడానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తుంటారు. అలాగే గ్రీస్ వ్యాలీ అనేది విశాలమైన లోయ ప్రాంతము. ఈ లోయను చూడడానికి వీలుగా టూరిజం శాఖ కొండ చివరన ఓ ఫ్లాట్‌పాం నిర్మించింది. ఇక్కృడి నుంచి చూస్తే ప్రకృతి అందాలు అత్యంత రమణీయంగా కన్పిస్తాయి.


ఇక పైన్ వృక్షాల వనం కూడా దాదాపు కిలోమీటరు పొడవున పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉండే కురింజి స్వామి దేవాలయంలో సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నాడు. ఈ ప్రాంతంలోని కురింజి అనే చెట్లకు 12ఏళ్లకోసారి మాత్రమే పుష్పాలు పూస్తాయి. అందువల్లే ఇక్కృడి దేవునికి కురింజి ఆండవర్ (దేవుడు) అనే పేరు వచ్చింది.

కొడైకెనాలోని వసతి సౌకర్యాలు
కొడైకెనాల్‌లోని బస్టాండ్ ప్రాతం చుట్టుపక్కలా అనేక హోటళ్లు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఓ మాదిరి ధరలకే ఇక్కడి హోటళ్లు తమ సేవలు అందిస్తాయి. ఈ ప్రాంతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టూరిజం కార్యాలయం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడికి చేరుకుంటే కొడైకెనాల్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు లభిస్తాయి.

కొడైకెనాల్‌కు రవాణా సౌకర్యం
కొడైకెనాల్‌ను రైలు, బస్సు, విమానం ద్వారా చేరుకోవచ్చు. అయితే దేనిద్వారా అయినా కొడైకెనాల్ పర్వతప్రాంత పీటభాగాన్ని చేరుకుని అక్కడినుంచి ఘాట్‌రోడ్డులో బస్సు ప్రయాణం చేయాల్సిఉంటుంది.

తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నుంచి విమానం ద్వారా అయితే కొడైకెనాల్‌కు చుట్టుపక్కల ఉన్న మధురై, కోయంబత్తూర్, తిరుచురాపల్లి తదితర ప్రాంతాలు చేరుకుని అక్కడినుంచి ఇతర వాహనాల ద్వారా కొడైకెనాల్ చేరుకోవచ్చు. అలాగే రైలు ప్రయాణమైతే చెన్నై నుంచి నేరుగా కొడైకెనాల్ రోడ్డు స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి ఘాట్ రోడ్డు ద్వారా కొడైకెనాల్ పట్టణానికి చేరుకోవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

Show comments