Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకృతి సంగీతాన్ని ఆలాపించే "షిల్లాంగ్"

Webdunia
ఆకాశాన్ని తాకే శిఖరాలు, పాతాళాన్ని మరిపించే లోయలు, చుట్టూ పచ్చని అడవులు, పర్వతాలు, కొండచరియల నుండి జాలువారే సెలయేటి గలగలను చూడాలంటే... ఈశాన్య సుందరాంగి అయిన షిల్లాంగ్‌ను దర్శించాల్సిందే. భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రమైన మేఘాలయ రాజధానియే ఈ షిల్లాంగ్. ఈశాన్య భారతావనిలో అతి సుందర ప్రదేశాలలో షిల్లాంగ్ ప్రముఖమైనది.

షిల్లాంగ్ ప్రకృతి అందాలను చూసి, మోహించి, చుంబించేందుకేనా మేఘరాజు పర్వతాలమీదికి దిగివచ్చాడా అని అనిపిస్తుంది. ఇక్కడి వాతావరణాన్ని గమనిస్తే, కొండల మీద పాము మెలికలను తలపించే కాలిబాటలు, దట్టమైన అడవులను చుట్టుకుని వస్తుంటాయి.

ఎటుచూసినా వర్షపు తుంపరలే. ప్రతిరోజూ వర్షం కురుస్తూనే ఉంటుంది. షిల్లాంగ్‌లో వీచేచటువంటి గాలులు, ఆ గాలులు కదిలించటంవల్ల కదిలే కొమ్మలు, ఆకులు చిత్ర విచిత్రమైన సంగీతాన్ని సృష్టిస్తూ... మన చెవులకు వీనుల విందైన ప్రకృతి సంగీతాన్ని వినిపిస్తుంటాయి.

షిల్లాంగ్‌లోని అడవులలో వందలకొద్దీ పక్షి జాతులు, వాటికి పోటీపడేలా జంతు జాతులు పర్యాటకులను విశేషంగా అలరిస్తుంటాయి. పక్షులు, జంతువులు కలిసి సంగీత కచేరీ చేస్తున్నట్లుగా ఉంటాయి వాటి ధ్వనులు. ఇలాంటి ప్రకృతి సహజ ధ్వనుల మధ్య పెరిగినందుకేనేమో... మేఘాలయా జాతి ప్రజలలో కూడా సంగీతం సహజంగానే వచ్చినట్లుంటుంది.

మేఘాలయ ప్రజల పాటలు, సంగీత వాయిద్యాలు కూడా అన్నీ విశేషాలుగానే చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రతి కుటుంబంలోనూ.. ఒక గాయకుడు, వాయిద్యకారుడు తప్పకుండా ఉంటారు. ప్రతి పది కుటుంబాలకు కలిసి ఒకే మ్యూజికల్ బ్యాండ్ కూడా ఉంటుంది. ఈ రకంగా, ప్రకృతి సంగీతంలో మమేకమైన ఈ ప్రజలు, వారు పాడే పాటల్లోనూ, వాయిద్యాలలోనూ ఆ సంగీతాన్ని ప్రపంచానికి వినిపిస్తున్నారు.

ఇకపోతే... ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశంగా రికార్డును సాధించిన చిరపుంజి.. షిల్లాంగ్‌లో భాగమే. మేఘాలయలో మూడోవంతు అటవీమయం కాగా... పశ్చిమాన 'గారో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి', 'జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి కానీ, ఇవి మరీ ఎత్తైనవి కావు. 'షిల్లాంగ్ శిఖరం' అన్నింటికంటే ఎత్తైనది (1,965 మీటర్లు). పర్వతాలలో చాలా గుహలలో విలక్షణమైన 'స్టేలక్టైటు', 'స్టేలగ్మైటు' సున్నపురాయి ఆకృతులున్నాయి.

ఎలా వెళ్లాలంటే...?

షిల్లాంగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌వారి "ఉమ్రోయ్" ఎయిర్‌పోర్టు ఉంటుంది. వారంలో నిర్దేశిత రోజుల్లో కలకత్తా నుంచి ఉమ్రోయ్‌కు విమానాలుంటాయి. అలాగే గౌహతిలోని గోపినాథ్ బోర్డోలోయ్ ఎయిర్‌పోర్టు నుంచి కూడా రెగ్యులర్‌గా విమానాలు నడుపుతుంటారు. గౌహతి టౌన్ సెంటర్ నుంచి విమానాశ్రయం వరకు క్యాబ్‌లు, టాటా సుమోలు కూడా అందుబాటులో ఉంటాయి.

మేఘాలయ నుంచి మాత్రం రైలు సౌకర్యం లేదు. అయితే భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి గౌహతికి మాత్రం రెగ్యులర్‌గా రైళ్లు నడుస్తుంటాయి. గౌహతి నుంచి 104 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే షిల్లాంగ్ చేరుకోవచ్చు. గౌహతి రైల్వే స్టేషన్ నుంచి అస్సాం ట్రాన్స్‌ఫోర్టు కార్పోరేషన్ వారు నడిపే బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటిలో ప్రయాణ ఛార్జీలు 30 నుంచి వంద రూపాయలదాకా ఉండవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments