అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా ఈజీనే... ఇవి పాటిస్తే...

Webdunia
సోమవారం, 13 మే 2019 (16:38 IST)
"మహిళలను అర్థం చేసుకోవడం చాలా కష్టం" అని పురుషులు చాలామంది అంటుంటారు. అయితే ఓ స్త్రీ, మగవాడి నుంచి ఏం ఆశిస్తుందనే విషయంలో కాస్త శ్రద్ధ పెడితే అమ్మాయిలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అటున్నారు. మహిళలు ముఖ్యంగా పురుషుడు నిజాయతీపరుడై ఉండాలని భావిస్తారట. ధైర్యం సరేసరి. 
 
అయితే, ఒక్కసారి అబద్ధం చెప్పి బుక్కయిపోతే, కొంపమునిగినట్టేనని నిపుణులు అంటున్నారు. అబద్ధాలు చెపితే అంతతేలిగ్గా క్షమించరట. తప్పు ఒప్పుకుంటే మాత్రం ఆమె మనసు కరిగించేందుకు కొన్ని అవకాశాలను సృష్టించుకున్నట్టే అవుతుంది. ఇక, ఆమె చెప్పేది అత్యంత శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. స్త్రీతో సుదీర్ఘ బంధం నెరపాలంటే ఇలా చేయకతప్పదు మరి. తను చెప్పేది వినాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. మీతో ఆ స్త్రీ భావోద్వేగపరమైన అనుబంధం ఏర్పరచుకునేందుకు అనువుగా మసలుకోవాలి. 
 
అన్నింటికన్నా ప్రధానమైనది ఏమంటే... స్త్రీలు, పురుషుల కంటే త్వరగా పరణతి సాధించినా, పురుషుడే తమకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటారు. తమ పురుషుడు గొప్పలు కొట్టేవాడు కాకుండా, తగిన నియంత్రణతో, కార్యదక్షత ఉన్న వ్యక్తి అయి ఉండాలని ఆశిస్తారు. ఒకవేళ మీరు సమస్యల నుంచి పారిపోయే వ్యక్తి అయితే, స్త్రీ మనసులో స్థానం కోల్పోయినట్టే.. ఆలోచించుకోండి మరి!. స్త్రీ మనస్సును గెలుచుకోవాలంటే పైన చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకోకతప్పదని నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

తర్వాతి కథనం
Show comments