Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగా.. అమ్మాయిలూ జాగ్రత్తపడండిలా!

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (12:04 IST)
స్నేహం, ప్రేమ ఇలా ఏ బంధమైనా ఎక్కువగా ప్రభావితమయ్యేది అమ్మాయిలే. ఒకవేళ ఆ బంధం బలపడితే సరికానీ.. తెగిపోతే మాత్రం అమ్మాయిలే నష్టపోతారన్నది సత్యం. ఏ విషయంలోనైనా మగవాళ్ళు నష్టపోవడం చాలా తక్కువ. 
 
ఎవరో సున్నితమనస్కులైతే తప్ప ఇలాంటి బ్రేకప్స్‌ను అబ్బాయిలు ఈజీగానే తీసుకుంటున్నారు. అసలీ బ్రేకప్స్ రావాల్సిన పనేముంది? డేటింగ్‌కు ముందే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. డేటింగ్‌కు ముందు అమ్మాయిలు ఎలా జాగ్రత్తపడాలంటే.. 
 
* మీరు డేటింగ్‌కు ఎంచుకోవాలనుకునే అబ్బాయి.. కొత్త ప్రయత్నాలు చేయకుండా... అన్నీ ఏకపక్షంగా చర్యలకే ప్రాధాన్యమిస్తుంటే అలాంటి వ్యక్తిని దూరంగా పెట్టారు. లేదంటే ప్రమాదమే.
 
* మీరు వారి బానిసలుగా తలచుకుంటే అంటే అమ్మాయిలు వంటింటికే పరిమితం అనే చందంగా మాట్లాడే అస్సలు వారి జోలికే పోకూడదు.  
 
* ఎప్పుడూ తాము కొన్న వస్తువుల ధరలు, హోటల్ తిండి ఖర్చులు గురించి పదేపదే ప్రస్తావించేవారితో చాలా కష్టం. డేటింగ్ చేసినన్నాళ్ళూ వీరు మరింత పిసినారితనంతో ప్రవర్తిస్తారన్నదానికి అవి సంకేతాలు. 
 
* స్పోర్ట్స్ చూసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే అబ్బాయిలు... ఓ అనుబంధం పట్ల, కుటుంబం పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఎన్నడూ పట్టించుకోరు. ఇవన్నీ, వారు బాల్య పోకడల నుంచి బయటపడలేదన్న విషయాన్ని సూచిస్తాయి.
 
* అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతి క్షణం నిఘా వేసే వ్యక్తికి దూరంగా ఉండాలి. బయటికెళితే ఎవరితో తిరుగుతోంది? ఏంచేస్తోంది? వంటి అనుమానాలతో వేగిపోయే మగవాణ్ణి ఎంతదూరం పెడితే అంతమంచిది. 
 
* బంధం పట్ల అవగాహన లేకుండా, చపలచిత్తం ప్రదర్శిస్తుంటారు కొందరు. ఓసారి అనుబంధం కొనసాగించాలని, మరోసారి పిల్లలు కావాలని అంటుంటారు... రెణ్నెల్ల తర్వాత, అసలేదీ తేల్చుకోలేకపోతారు. వీరితోనూ జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

Show comments