Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంతమంది అబ్బాయిలకే అమ్మాయిలు ఫ్లాట్.. ఎందుకో..?

Webdunia
WD
అవునూ... కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారో తెలియదు కానీ... ఎవరితోనూ కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడని ఓ అందమైన అమ్మాయి తెల్లారేసరికి అతని ప్రక్కనే ప్రత్యక్షమవుతుంది. ఇదెలా సాధ్యం... దీనినే తొలిచూపు ఆకర్షణ అనుకోవాలా..? సదరు అబ్బాయి తీయని మాటల బాణాలు ఆమె ఎదలోతులను మృదుమధురంగా స్పృశించి మనసు చలించి అతనితో స్నేహానికి ఓకే చెప్పింది అనుకోవాలా..? అసలెలా అంత త్వరగా ఓ అమ్మాయి సదరు అబ్బాయి వెంట చనువుగా తిరుగుతుందీ... అనే ప్రశ్న చాలామంది కుర్రాళ్లను వేధిస్తుంటుంది.

చివరికి అది కొందరికే సాధ్యమైన విద్య అని సరిపెట్టుకుంటారు కుర్రాళ్లు. కొందరైతే సదరు అమ్మాయి- ఆ అబ్బాయి వెనక ఉన్న డబ్బును, హోదాను చూసి స్నేహం చేస్తుందనుకుంటారు. ఇంకొందరు అతని చదువు, ప్రవర్తన ఇత్యాది అంశాలవల్ల స్నేహం చేస్తుందనుకుంటారు. ఇలాంటి కారణాలు ఇంకా ఎన్నెన్నో చెపుతారు. అయితే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయడమేకాక సదరు అబ్బాయిలతో ప్రేమలో పడటానికి కారణం అతనిలోని నిజాయితీ.

మనసులో ఉన్న భావాలను ధైర్యంగా తనకు నచ్చిన అమ్మాయితో చెప్పడం కొంతమంది అబ్బాయిలకే సాధ్యం. అదేవిధంగా ఆమెపై తనకు గల ప్రేమను వ్యక్తపరిచినపుడు ఆ అమ్మాయి దానిని తిరస్కరించినా బాధపడక స్పోర్టివ్‌గా తీసుకుని స్నేహితులుగా ఉందామని ఒప్పించే నైజం కలిగి ఉంటారు ఈ అబ్బాయిలు. స్నేహంలో తన మంచితనం ఎటువంటిదో ఆమెకు చూపించడం ద్వారా తిరిగి ఆమె మనసులో స్థానం సంపాదించుకుంటారు.

ఇక మరికొందరు అబ్బాయిలు అందంగా వస్త్రాలంకరణ చేసుకుని "రిచ్"గా కనిపిస్తే, అమ్మాయిల స్నేహం కుదురుతుందని అనుకుంటారు. కానీ ఇది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సాధ్యం. అయితే ఆ పరిచయం కూడా కొంతకాలమే నిలుస్తుంది.

ఇకపోతే... అమ్మాయి కనబడిందే తడవుగా తన మనసులో ఉన్నదంతా కక్కేస్తూ... వట్టి వాగుడుగాయ ముద్రవేసుకునేవారు అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకర్షించలేరు. ముందు ఆ అమ్మాయి చూపులలోని భావం ఏం చెపుతుందో తెలుసుకుని దానిని అనుసరించి మసలుకుంటే ప్రయోజనం ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments