Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ...

Webdunia
WD
ప్రేమలోకంలో విహరించే జంట మధ్య చోటుచేసుకునే ప్రతి సంఘటన ఓ తీయని అనుభూతిని మిగులుస్తుంది. ఇద్దరూ ఊహాలోకంలో విహరిస్తూ ఎన్నో బాసలు చేసుకుంటారు. మృదుమధురంగా... తీపి జ్ఞాపకాలుగా మిగిలే ఆ తీయని అనుభూతులు ఎలా ఉంటాయో మన తెలుగు వెండితెర కూడా కాస్తంత ఒలికించింది. ప్రేయసీప్రియుల ఊహలకు దాశరథి రెక్కలు తొడిగితే... ఇద్దరి మదిలో మెదిలే భావాలకు ప్రాణం పోశారు ఎస్పీబీ.. వాణీజయరాం. మరచిపోలేని ఆ లవ్ సాంగ్‌ని ఓసారి చూద్దామా....

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
ఎన్నెన్నో

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి
నిన్నే చూసిన వేల నిండును చెలిమి
నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి
నిన్ను చేరనా. చేరనా.. చేరనా!
ఎన్నెన్నో


కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ .. నీవుండాలి
నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు
ఉండనీ. ఉండనీ.. ఉండనీ..
ఎన్నెన్నో

చిత్రం : పూజ
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం
రచన : దాశరథి
సంగీతం : రాజన్-నాగేంద్ర
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

Show comments