Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు : గుర్తులుగా కూరగాయలు

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (10:53 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలంగాణా రాష్ట్రంలోని 17 స్థానాలకు కూడా ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 11వ తేదీన జరుగనుంది. అయితే, ఈ రాష్ట్రంలోని నిజామాబాద్ స్థానం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానంలో ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పసుపు, ఎర్రజొన్న రైతులు. దీంతో అందరి దృష్టి ఈ స్థానం ఎన్నికపై కేంద్రీకృతమైంది. అదేసమయంలో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న రైతులకు యాదృచ్ఛికమో.. కాకతాళీయమో ఏమో తెలియదుకానీ ప్రతి ఒక్కరికీ కూరగాయలను గుర్తులుగా ఎన్నికల సంఘం గుర్తించింది. 
 
మొత్తం 185 మంది పోటీలో ఉండగా, వీరిలో 178 మంది రైతులే కావడం గమనార్హం. ఇంతమందికి గుర్తులు కేటాయించడం కత్తిమీద సామే. అన్ని గుర్తులను ఎక్కడి నుంచి తేవాలని తలలుపట్టుకున్న ఎన్నికల సంఘం అధికారులకు కూరగాయలు, పండ్లు కనిపించాయి. అంతే.. ఒక్కో కూరగాయను ఒక్కో అభ్యర్థికి కేటాయించింది.
 
ఇందులో పాతకాలం నాటి కల్వం (చిన్నసైజు రోలు), రోకలి, ఇసుర్రాయి వంటి వాటిని కూడా గుర్తులుగా కేటాయించి పాతకాలం నాటి చెరిగిపోయిన జ్ఞాపకాలను ఈసీ మరోమారు గుర్తు చేసింది. అలాగే, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, వంటపాత్రలను కూడా ఎన్నికల అధికారులు వదల్లేదు. 
 
ఇక, కూరగాయలు, పండ్లు విషయానికి వస్తే బెండకాయ, క్యాబేజీ, అల్లం, పచ్చిమిర్చి, బెంగళూరు మిర్చి, నూడల్స్, చాక్లెట్స్, పళ్లెం, ద్రాక్ష గుత్తి, సెల్‌ఫోన్ చార్జర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ మౌస్, బిస్కెట్లు, ఐస్ క్రీం, కేకు, బఠానీలు, వాటర్ హీటర్, స్విచ్ బోర్డు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ ఎన్నికల గుర్తులుగా ఎన్నికల సంఘం కేటాయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments