Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్!

వరుణ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (17:07 IST)
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అల్లర్ల వంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటివిడతలో 21 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.78 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.
 
అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 68.35 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత మణిపూర్‌ 63 శాతం, మేఘాలయలో 61 శాతం, అస్సాంలో 60 శాతం మంది ఓటర్లు ఇప్పటివరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా బీహార్‌లో 39.78 శాతం పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.
 
ఆయా రాష్ట్రాల్లో తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, కొత్త జంటలు ఓటు వేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగాల్‌లో కొన్నిచోట్ల టీఎంసీ, భాజపా వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మణిపుర్‌లో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పుల శబ్దాలు కలకలం సృష్టించాయి. 
 
న్యాయం కోసం పోరాడుతున్నాం.. షర్మిలను గెలిపించండి : సునీత 
 
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని వారిని దోషులుగా నిలబెట్టాలని, మా తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా తెలిపారు. పైగా, కడప లోక్‌సభ బరిలో నిలిచిన వైఎస్ షర్మిలను గెలిపించాలని ఆమె కడప జిల్లా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆమె స్పందించారు. దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. 'న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైకాపా అడ్డుపడుతోంది. పులివెందులలో నేను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారు. వివేకా హత్య అంశంపై వైకాపా నేతలు చాలాసార్లు మాట్లాడారు. మీ ఇళ్ల వద్దకు నేను రాలేకపోతే మన్నించండి. ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యత ప్రజలదే' అని ఆమె పేర్కొన్నారు. 
 
వివేకా హత్యకేసు అంశంపై వైఎస్‌ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, పురంధేశ్వరి, పవన్‌ కల్యాణ్‌, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైఎస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కడప కోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రతివాదులు, వారి అనుచరులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఈ కేసులో అవినాష్‌రెడ్డిని హంతకుడిగానూ, సీఎం జగన్‌ ఆయన్ను కాపాడుతున్నట్లుగానూ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఇలా వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేవి, వ్యాఖ్యలు చేయరాదని కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments