మా రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడితే రాజీనామా : పంజాబ్ సీఎం

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (15:16 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇపుడు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సవాళ్లు విసురుతున్నారు. 
 
తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తన సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో కనుక కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే అందుకు బాధ్యతగా తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ కనుక పరాజయం పాలైతే అందుకు తాను పూర్తి బాధ్యత తీసుకుంటానన్నారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇందుకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. "లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అందుకు పూర్తి బాధ్యత నాదే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పార్టీ గెలుపు, ఓటములకు మంత్రులు, శాసనసభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధిష్టానం ఎప్పుడో చెప్పింది. నేనైతే ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయినా, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది" అని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తుదివిడతలోనే పంజాబ్‌లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments