కాంగ్రెస్ వాళ్లంతా పప్పు అని పెట్టుకోవచ్చు...

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:16 IST)
ప్రధాని నరేంద్ర మోదీ తాను ఈ దేశానికి చౌకీదారుని అంటూ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చౌకీదారు అంటే కాపలాదారు అని అర్థం. ఇటీవల మోదీ మై బీ చౌకీదార్ అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఉండే పేరుకు ముందు కూడా చౌకీదార్ అని చేర్చారు. మోదీ క్యాబినెట్ మినిస్టర్‌లు సైతం మోదీ బాట పట్టారు. వారు కూడా తమ ట్విట్ట‌ర్ అకౌంట్ల‌లో పేరు ముందు చౌకీదార్ అని జోడించారు. 
 
చౌకీదార్ అని పేరు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. చౌకీదార్ పదంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చౌకీదార్ చోర్ పై అంటూ ఎదురుదాడి మొదలుపెట్టింది. మోదీ కేవలం సంపన్నులకు మాత్రమే చౌకీదారుడు అంటూ ప్రియాంక వాద్రా కూడా విమర్శించింది.
 
ఈ నేపథ్యంలో హర్యానాకు చెందిన బీజేపీ మంత్రి అనిల్ విజ్ ఓ సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నేత‌లు త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్ల పేరు ముందు పప్పూ అని జోడించుకోవాల‌ని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పూ అంటూ విపక్ష నేతలు వెటకారంగా సంభోదిస్తున్నారు. ఈ క్రమంలోనే అకౌంట్‌ల పేరు ముందు పప్పూ అని పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి అనిల్ విమర్శలు చేసారు. 
 
కాంగ్రెస్ కార్యకర్తలంతా తమ ఖాతా పేరు ముందు పప్పూ అని పెట్టుకోవాలని మంత్రి అనిల్ సూచించారు. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ఈ మాటల యుద్ధం తీవ్రతరం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments