Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలహీన ప్రధాని... నిలదీస్తే పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు : ప్రియాంకా

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (11:45 IST)
కేంద్రంలో ఉన్న ఇలాంటి బలహీన ప్రభుత్వం, బలహీన ప్రధానిని ఇదివరకెన్నడూ తాను చూడలేదని.. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
ఆమె సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ జిల్లాలోని పూలపల్లిలో ప్రియాంక శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వయనాడ్ సోదరీమణులు మరియు సోదరులారా.. నేను ఇప్పుడున్న ప్రభుత్వంలాంటి బలహీన ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రధాని వంటి బలహీన ప్రధానిని గతంలో ఎన్నడూ చూడలేదు. 
 
ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం ఇప్పుడు మీకు కావాలి. ప్రభుత్వానికి వ్యతిరేకమైనప్పటికీ.. ప్రజల గొంతుకను వినిపించేందుకు అవకాశమిచ్చే ప్రభుత్వం ఇప్పుడు రావాలి. ప్రజలను గౌరవిస్తూ.. చేసిన వాగ్దానాలను నిలుపుకునే ప్రధాని ఇప్పుడు మీకు అవసరం అని వ్యాఖ్యానించారు. ప్రజల్ని విడగొట్టాలని వాళ్ళు(బీజేపీ) ప్రయత్నిస్తున్నారు. తమ కష్టాలను చెప్పుకోవడానికి దేశం నలుమూలల నుంచి రైతులు మీ దగ్గరకు (ఢిల్లీకి) వస్తే, వాళ్ళ విన్నపాలను వినిపించుకోకుండా తరిమికొట్టారని దుయ్యబట్టారు.
 
మీ ప్రభుత్వాన్ని, మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేసిన ప్రజలపై దాడి చేసి, జైల్లో పెట్టారు. దీన్ని జాతీయవాదం అంటారా? అంటూ ప్రియాంక నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు తప్ప, ప్రజలకు ఏం చేస్తారు? ఇచ్చిన వాగ్దానాలను ఎంత వరకు నెరవేర్చారు అనే విషయాలను చెప్పరని బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆమె ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. గత ఐదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిందల్లా దేశాన్ని ముక్కలు చేయడమేనన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments