Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా ఫైనల్ పోలింగ్ ప్రారంభం... కట్టుదిట్టమైన భద్రత

Webdunia
ఆదివారం, 19 మే 2019 (07:45 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగం తుది దశ పోలింగ్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో విస్తరించిన 59 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లోని 10,01,75,153ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు, పంజాబ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 9, మధ్యప్రదేశ్‌లోని 8, బీహార్‌లోని 8, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, జార్ఖండ్‌లోని 3, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల నుంచి 918 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 
 
పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆదివారం జరిగే పోలింగ్‌తో కలిపితే దేశంలో 542 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసినట్లవుతుంది. చివరి దశ పోలింగ్‌ సందర్భంగా దేశంలోని అందరి కళ్లూ వారణాసి నియోజకవర్గంపైనే ఉన్నాయి. ఇక్కడ మోడీ, మరో 25 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments