ఆగష్టు 12న శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు... పుష్క‌ర అడ్డంకి లేదు!

విజ‌య‌వాడ‌: చరిత్రలోనే తొలిసారిగా కృష్ణా పుష్కర ప్రారంభపు రోజైన 12 ఆగష్టు 2016 న వరలక్ష్మి వ్రతం రావటం విశేషం. ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించకూడదని మరొక రోజున ఆచరించాలని అనేకమంది చెబుతున్నారు. కానీ, పుష్కర ప్రారంభ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించకూడదనే శ

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (22:24 IST)
విజ‌య‌వాడ‌: చరిత్రలోనే తొలిసారిగా కృష్ణా పుష్కర ప్రారంభపు రోజైన 12 ఆగష్టు 2016 న వరలక్ష్మి వ్రతం రావటం విశేషం. ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించకూడదని మరొక రోజున ఆచరించాలని అనేకమంది చెబుతున్నారు. కానీ, పుష్కర ప్రారంభ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించకూడదనే శాస్త్ర నియమం ఎక్కడా లేనే లేద‌ని విజ‌య‌వాడ‌కు చెందిన‌ ప్ర‌ముఖ జ్యోతిష శాస్త్ర పండితుడు ఎన్.వి.ఎల్.ఎస్. ప్ర‌సాద్ తెలిపారు. 
 
సహజంగా పితృకార్యము ఉన్న రోజున ఓ పర్వదినం వస్తే... పితృ కార్యానికే (ఆబ్దికం లేక శ్రాద్ధం లేక తద్దినం) తొలి ప్రాధాన్యత ఇవ్వటమనేది సంప్రదాయం. ఈ సంవత్సరం శ్రావణ శుక్ల నవమి రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఒకవేళ ఎవరైనా శ్రావణ శుక్ల నవమి నాడు మరణించి ఉంటే, వారి సంతానం ఆ ఆబ్దికాన్ని ప్రతి సంవత్సరం వచ్చే ఆ శ్రావణ శుక్ల నవమి నాడు ఆచరిస్తారు. కాబ‌ట్టి ఆ తిథి నాడు మరణించి, ప్రస్తుతం ఈ సంవత్సరం ఆ తిథి నాడు ఆబ్దికం నిర్వహించుకొనే వారు మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించకూడదు. మిగిలిన వారందరూ నిరభ్యంతరంగా వ్రతాన్ని ఆచరించవచ్చు.
 
తమతమ పితరులకు తర్పణ, పిండ ప్రదానాదులు పుష్కరాలు జరిగే 12 రోజులలో ఆచరించవచ్చు. శ్రావణ శుక్ల నవమి నాడు ఉన్న పితృ కార్యాలు మాత్రం ఆగస్టు 12నే నిర్వహించుకోవాలి. గుంటూరు, కృష్ణ జిల్లాల వాసులు వరలక్ష్మి వ్రతం ఆచరించరాదని ఈ జిల్లాలలో ఉన్న పండితులు చెబుతున్నారు. పండితులు లేకుండా పుష్కర 12 రోజులలో తర్పణ, పిండ ప్రదానాదులు ఆచరించలేరు. కాబ‌ట్టి వారి హాజరు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ విధంగా చెపుతున్నారు. కానీ ప్రస్తుత రోజులలో వరలక్ష్మి వ్రతాన్ని పండితులు లేకుండానే ఎవరికీ వారే వారి వారి గృహాలలో చక్కగా ఆచరించుకుంటున్నారు. 
 
ఒకవేళ అలా నిర్వహించుకోలేని వారు తోటి స్త్రీల సహాయ సహకారములతోనైనా వ్రతాన్ని ఆచరించుకోవటానికి ప్రయత్నించండి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రకృతి రాశి అయినా కన్యా రాశిలోకి దేవ గురువైన బృహస్పతి రాక రోజునే వరలక్ష్మి వ్రతం వచ్చింది కనుక... ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని, పండితులు లభ్యం కాలేదనే కారణంతో వాయిదా వేసుకోవద్దు. కాబట్టి ఇట్టి అరుదైన విశేష పర్వదినాన్ని భక్తి విశ్వాసాలతో ఆచరించండి. ఆగష్టు 12 చేయకూడదు అన్న వారంద‌రికీ ఈ విష‌యాన్ని తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలి : పవన్ కళ్యాణ్

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమని.. మోదీపై ప్రశంసలు.. ప్రజాసేవే ప్రధాన లక్ష్యం (video)

Nara Lokesh: రెడ్ బుక్‌లో కేవలం మూడు పేజీలు మాత్రమే నిండాయి.. నారా లోకేష్

ప్రధాని నరేంద్ర మోడీ హెలికాఫ్టర్‌ను వెనక్కి తిప్పి పంపేశారు... ఎందుకో తెలుసా?

హోటల్‌లో మహిళా షూటర్‌పై అత్యాచారం.. గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు.. మిథునరాశి వారికి.. ఆదాయం ఎంత?

17-12-2025 బుధవారం ఫలితాలు - రుణవిముక్తులవుతారు. తాకట్టు విడిపించుకుంటారు

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు.. వృషభరాశి వారికి.. వ్యయం ఎంతంటే?

టీటీడీకి రూ.60 లక్షలు విరాళం

16-12-2025 మంగళవారం ఫలితాలు - మీ జీవితంలో ఊహించని సంఘటన ఎదురవుతుంది...

తర్వాతి కథనం
Show comments