Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే.. మొదటికే మోసం..!!

Webdunia
FILE
అనగనగా ఓ దట్టమైన అడవి. ఆ అడవిలో ఓ పాముల పుట్ట ఉండేది. ఆ పుట్టలో చాలా పాములుండేవి. అయినా అవి ఏరోజు గొడవపడకుండా ఎంతో ఐకమత్యంగా జీవిస్తుండేవి. ఒకరోజున బాగా బలిసిన ఒక ముళ్లపంది పాముల పుట్టకు దగ్గరగా వచ్చింది. దాని శబ్దానికి ఉలిక్కిపడిన పాములు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి.

" ఏయ్ ముళ్లపందీ.. మా పుట్టదగ్గరికి వచ్చి అలా గొణుగుతూ నిల్చున్నావేంటి..?" అంటూ హెచ్చరికగా అడిగాయి పాములు.

" ఆ మరేం లేదు పాములూ.. తిండి కాస్త ఎక్కువగా దొరకటంతో ఆబగా తినేశాను. భుక్తాయాసం ఎక్కువగా ఉంది. దాన్ని తీర్చుకునేందుకు ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే ఎక్కడ చూసినా పక్షుల కూతలు, ఇతర జంతువుల శబ్దాలతో ఒకటే రొదగా ఉంది. అందుకే మీ పుట్టలో కాస్త చోటిస్తే కాసేపు నిద్రపోయి, తరువాత వెళ్లిపోతాను" బ్రతిమలాడుకుంటూ అడిగింది ముళ్లపంది.

" అయినా మా పుట్టలో ఇప్పటికే చాలా పాములున్నాయి. మాకే చోటు సరిగా సరిపోవటం లేదు. ఇప్పుడు నీకు చోటివ్వాలంటే మాకు బాగా కష్టమైపోతుంది. ఎలా..?!" అన్నాయి పాముల ు.

" బాబ్బాబూ.. మీకు పుణ్యం ఉంటుంది. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తోంది. ఈ ఒక్కసారికి ఎలాగైనా సర్దుకోండి. ఇంకెప్పుడూ మీ సహాయం అడగను" అంటూ వేడుకుంది ముళ్లపంది.

" సరేలే రా.. మేమే ఎలాగోలా ఒదిగి పడుకుంటాం. ఈ మూలన నువ్వు సర్దుకుని పడుకో.."మని చెప్పాయి పాములు. అంతే ముళ్లపంది మెల్లిగా లోపలికి దూరింది. పుట్టలో ఎలాంటి శబ్దాలు లేకుండా వెచ్చగా ఉండటంతో హాయిగా నిద్రలోకి జారుకుంది.

ముళ్లపంది నిద్రపోయిందేగానీ, దాని ఒంటిమీదుండే ముళ్లన్నీ ఒక్కొక్కటీ విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి. అంతే కోపంతో ఊగిపోయిన పాములన్నీ ఒక్కసారిగా లేచి బుసలు కొడుతూ, ముళ్లపందిని లేపి ఇక్కడినుంచి వెళ్లిపో అంటూ గట్టిగా కేకలు పెట్టాయి.

" చూడండి పాములూ.. ఇక్కడ నాకు చాలా హాయిగా, వెచ్చగా ఉంది. పైగా నిద్ర కూడా ముంచుకొస్తోంది. నా నిద్రను పాడు చేయకుండా మీ మానాన మీరు వెళ్లండి.. అంతగా మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటికి వెళ్లిపోండి అంటూ ముళ్లను ఇంకాస్త పొడవుగా చాపుకుని పడుకుంది".

దాంతో ముళ్లపంది ముళ్లు పాములకు బాగా గుచ్చుకున్నాయి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, ఆ ముళ్లు గుచ్చుకుని చనిపోయినా ఆశ్చర్యం లేదని అనుకున్న పాములన్నీ ముళ్లపందిని తిట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాయి. అంతే కథ కంచికి మనం ఇంటికి. ఇక ఈ కథ ద్వారా తెల్సుకోవాల్సిన నీతి ఏంటంటే.. దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే, మొదటికే మోసం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Show comments