Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలి రామలింగడు.. తిమ్మయ్య.. రత్తయ్య..!!

Webdunia
FILE
ఒకసారి తెనాలి రామలింగకవి పొరుగుదేశం వెళ్లాడు. అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్లిన ఈయన కోటలోకి ప్రవేశించటం అంత సులువేమీ కాదు. అయితే అక్కడికి వెళ్లి చూస్తే సరిపోతుందనుకుంటూ కోటవద్దకు చేరాడు. కోట వాకిలివద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు. రామలింగడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగానే.. కొత్తవాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య.

రామలింగడు రత్తయ్యను బ్రతిమలాడితే, అతడు లంచం అడిగాడు. దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు.. "ఇప్పుడు నావద్ద డబ్బులేదుగానీ, నువ్వుగనుక లోపలికి పంపించావంటే, నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తా"నని చెప్పాడు. సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు.

అలా కోట లోపల కొంతదూరం వెళ్లిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు. అయ్యా..! రాజుగారిని చూడాలని ఆయన అనగానే.. కొత్తవాళ్లను లోపలికి పోనియ్యమని అన్నాడు తిమ్మయ్య. ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు. అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగకవి. అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు.
కొరడా దెబ్బలే కావాలి...!!
"ఎవరయినా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు. దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా...?" అంటూ రామలింగడిని ఎగాదిగా చూశాడు మహారాజు. "తప్పదు మహారాజా... నాకు దెబ్బలే కావాలి. దయచేసి ఇప్పించండి" అన్నాడాయన. పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహా...


కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు. రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు. అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో, రాజుగారు బాగా మెచ్చుకున్నాడు. ఏంకావాలో కోరుకోమని అన్నాడు. దీంతో "మహారాజా...! నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు..!!" అన్నాడు రామలింగడు.

" ఎవరయినా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు. దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా...?" అంటూ రామలింగడిని ఎగాదిగా చూశాడు మహారాజు. "తప్పదు మహారాజా... నాకు దెబ్బలే కావాలి. దయచేసి ఇప్పించండి" అన్నాడాయన. పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు "సరే కొట్టండి" అని భటులను ఆజ్ఞాపించాడు.

భటులు కొరడాలతో సిద్ధమయ్యాక.. "మహారాజా..! మన్నించండి. ఈ కానుకలు సగం మొదటివాకిలి రత్తయ్యకు పోవాలి. మరో సగం రెండోవాకిలి తిమ్మయ్యకు పోవాలని" చెప్పాడు రామలింగడు. ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారనీ.. పాపం వాళ్లను మోసం చేయడం తనకు ఇష్టంలేదని అన్నాడు.

దాంతో మహారాజుకి అసలు కథ అర్థమయ్యింది. ఆ తరువాత రత్తయ్యకి, తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు. రామలింగడికి మాత్రం మంచి కానుకలు, రాజుగారి కొలువులో చోటు దొరికింది. చూశారా పిల్లలూ...! ఆ కాలంలోనే లంచాలకు ఆశపడినవారికి మన రామలింగకవి తెలివిగా ఎలా బుద్ధిచెప్పారో...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

11వ నంబర్ సీటే ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడింది!

Hyderabad: రైలు పట్టాలపై కుమార్తె సూసైడ్.. కాపాడటానికి వెళ్లిన తండ్రి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

Show comments