Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక రేణువులను ఎన్నని లెక్కించగలను..?

Webdunia
FILE
విదర్భ దేశస్థుడైన సూర్య నారాయణ శాస్త్రి తన పాండిత్యంతో కోశల దేశానికి చెందిన పండితుడు శంకర శాస్త్రిని ఓడించాలని బయలుదేరాడు. ఇంకాస్త దూరంలో కోశల దేశం చేరుకుంటాడనగా ఒక పశువుల కాపరి ఆయనకు ఎదురుపడ్డాడు.

సూర్య నారాయణ శాస్త్రిని ఎగాదిగా చూసిన పశువుల కాపరి, ఊరికి ఇతడెవడో కొత్తవానిలా ఉన్నాడనుకున్నాడు. వెంటనే "స్వామీ.. నమస్కారం. మీరెవరో కొత్తవారిలా ఉన్నారు. ఎందాక మీ ప్రయాణం..?" అంటూ వినయంగా ప్రశ్నించాడు.

" సకల శాస్త్రాలూ ఔపోశన పట్టిన ఉద్ధండ పండితుడిని. నా పేరు సూర్య నారాయణ శాస్త్రి. మీ కోశల దేశంలో ఉండే శంకర శాస్త్రిని ఓడించేందుకు విదర్భ దేశం నుండి వస్తున్నా"నని జవాబిచ్చాడు శాస్త్రి.
ఏం పండితుడివయ్యా..!
ఒక పిడికిట్లో ఉన్న ఇసుకను పిడికెడు ఇసుక అంటారని చెప్పలేని మీరు ఏం పండితుడివయ్యా..! అంటూ ఎగతాళిగా నవ్విన పశువుల కాపరి.. పిడికిట్లో ఉన్న ఇసుకను నేలమీద పడేసి తన దారిన తను వెళ్లిపోయాడు...


" అలాగా..! మంచిది స్వామీ.. నేనొక చిన్న ప్రశ్న వేస్తాను. జవాబు చెప్పగలరా..?" మళ్లీ అడిగాడు పశువుల కాపరి.

" ముందే చెప్పాను కదా.. ఎంతటి గొప్ప ప్రశ్నకైనా క్షణకాలంలో జవాబు చెప్పగల పండితుడినని.. అడుగు చెప్పేస్తా..." అన్నాడు శాస్త్రి.

అలాగే స్వామీ అన్న పశువుల కాపరి... శాస్త్రి చూస్తుండగానే, నేలమీదికి వంగి, తన కుడిచేతి నిండా ఇసుక తీసుకున్నాడు. వెంటనే "స్వామీ... ఈ ఇసుక రేణువుల పరిమాణం ఎంత..?" అని అడిగాడు.

" ఇసుక రేణువులను ఎన్ని రేణువులని తను లెక్కించగలడు..? అది తనకు సాధ్యమయ్యే పనేనా..?" అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శాస్త్రి.

కాసేపటి తరువాత పశువుల కాపరి.. "స్వామీ...! నా ప్రశ్నకు సమాధానం చెప్పారు కాదు.." అంటూ మళ్లీ ప్రశ్నించాడు.

" నువ్వే చెప్పవయ్యా..!!" అన్నాడు శాస్త్రి.

" ఒక పిడికిట్లో ఉన్న ఇసుకను పిడికెడు ఇసుక అంటారని చెప్పలేని మీరు ఏం పండితుడివయ్యా..!!" అంటూ ఎగతాళిగా నవ్విన పశువుల కాపరి.. పిడికిట్లో ఉన్న ఇసుకను నేలమీద పడేసి తన దారిన తను వెళ్లిపోయాడు.

" ఒక పశువుల కాపరి అడిగిన అతి చిన్న ప్రశ్నకే సమాధానం చెప్పలేని నేను.. శంకర శాస్త్రిని ఎలా ఓడించగలను..?" అని తనను తానే ప్రశ్నించుకున్న సూర్య నారాయణ శాస్త్రి.. పశువుల కాపరికి మనసులో కృతజ్ఞతలు తెలియజేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

Show comments