పిల్లలకు టీకాలు వేయిస్తున్నారా? ఉదయం పూటే బెస్ట్.. మధ్యాహ్నం, రాత్రి వద్దే వద్దు!

వ్యాధి నిరోధిక టీకాలను పిల్లలకు వేయిస్తున్నారా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మూడు పూటల్లో ఎప్పుడు వేయించాలో తెలుసా అయితే ఈ స్టోరీ చదవండి. వాక్సీనులను చిన్న పిల్లలకు నోటిద్వారా లేదా ఇంజక్షను ద్వారా ఇచ్చ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (17:42 IST)
వ్యాధి నిరోధిక టీకాలను పిల్లలకు వేయిస్తున్నారా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మూడు పూటల్లో ఎప్పుడు వేయించాలో తెలుసా అయితే ఈ స్టోరీ చదవండి. వాక్సీనులను చిన్న పిల్లలకు నోటిద్వారా లేదా ఇంజక్షను ద్వారా ఇచ్చినప్పుడు వారి శరీరంలో "అంటీ బాడీలు" అనే పదార్థములు తయారయి, అవి బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 
 
వ్యాధి నిరోధక టీకాలతో నిరోధించగలిగే ఆరు ప్రాణాంతక వ్యాధులు -క్షయ, గొంతువాపు, కోరింత దగ్గు , ధనుర్వాతం, పోలియో, తట్టు వ్యాధులకు టీకాలు ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత ఈ కార్యక్రమంలో ‘‘హైపటైటెస్-బి’’ అనే టీకాను కూడా చేర్చారు. వ్యాధి నిరోధక టీకాల వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మశూచి వ్యాధిని నిర్మూలించారు. అలాంటి వాక్సీన్లను ఉదయాన్నే వేయించుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుందని లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. 
 
ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సీన్లను అరవయ్యేళ్లు దాటిన వాళ్లకు ఇచ్చినప్పుడు వాళ్లలో మధ్యాహ్నం, సాయంత్రంతో పోలిస్తే ఉదయాన్నే వ్యాక్సీన్‌ వేయించుకున్నవాళ్లలో యాంటీబాడీల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే రోగనిరోధకశక్తి రోజంతా ఒకేవిధంగా ఉండదన్నది అర్థమవుతోంది.

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ రోగనిరోధకశక్తి తగ్గిపోతుంటుంది. కేవలం ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా రెండున్నర నుంచి ఐదు లక్షల మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ కొత్త పరిశోధన ఆధారంగా ఇన్‌ఫ్లూయెంజా వ్యాధిని తగ్గించే అవకాశం ఉందని వాళ్లు చెబుతున్నారు. అందుచేత పిల్లలకు వాక్సీన్లను ఉదయం పూట వేయించడం అలవాటు చేసుకోండి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జంట హత్యల కేసులో తొమ్మిది పోలీసులకు మరణశిక్ష: మదురై కోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధం - గొంతులో పొడిచి భార్యను హత్య చేసిన భర్త

భార్యతో మాజీ ఎమ్మెల్యే అఫైర్- సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భర్త

కీలక దశకు చేరుకున్న ఆర్టెమిస్-2 యాత్ర - 10న భూమికి తిరిగిరాక

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు అమరావతి బిల్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య

చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్‌ చేసిన తర్వాత...

Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్

తర్వాతి కథనం
Show comments