పిల్లలపై ఎండ పడనీయకుండా జాగ్రత్తలు పడుతున్నారా? ఐతే కష్టమే

పిల్లల్ని ఎండలో నిలబెడుతున్నారా? లేకుంటే ఎండపడనీయకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకుంటున్నారా? పిల్లలపై ఎండ పడకపోతే.. డి విటమిన్ లోపంతో అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏసీల్లోనే ఉండనీయకు

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (12:43 IST)
పిల్లల్ని ఎండలో నిలబెడుతున్నారా? లేకుంటే ఎండపడనీయకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకుంటున్నారా? పిల్లలపై ఎండ పడకపోతే.. డి విటమిన్ లోపంతో అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏసీల్లోనే ఉండనీయకుండా..  కనీసం గంటపాటు వారికి శారీరక వ్యాయామం ఉండేలా చూడండి అంటున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. అప్పుడే వారు దృఢంగా ఉండగలుగుతారని.. అవసరమైతే ఎండలో నిలబడినా తట్టుకోగలుగుతారని.. ఇలా చేయడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని వారు చెప్తున్నారు. లేకుండా వారిలో ఇమునిటీ లోపించి.. చిన్న చిన్న సమస్యలే పెను సమస్యలుగా మారిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇప్పటి పిల్లలంతా సాంకేతికతపై పట్టున్న చిచ్చర పిడుగులే. వాళ్లు నాలుగ్గోడల మధ్య కంప్యూటర్‌లూ, ట్యాబ్‌లకే పరిమితమైపోవడం వల్ల మానసికంగానూ, శారీరకంగానూ అలసట వారిని అంటి పెట్టుకునే ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఊబకాయం సరేసరి. ఈ పరిస్థితి దూరం కావాలంటే పిల్లల్ని నలుగురితోనూ కలవనివ్వండి. ఆరుబయట ఆడుకునేలా చూడండి. దీనివల్ల గట్టిగా నవ్వగలుగుతారు. వారి భావోద్వేగాల్ని బహిరంగంగా ప్రకటించగలుగుతారు.
 
రెస్టారంట్‌లోనో, కాఫీ షాపులోనో పిజా, బర్గర్‌... వంటి ఖరీదైన ఆహారాన్ని మీరు వారికి అందించొచ్చు. అవి తినేటప్పుడు పిల్లలూ సంతోషంగా ఉండొచ్చు. కానీ వారి ఆరోగ్యానికి చేసే హానిని గమనించాలి. అందుకే మితంగా తింటూ.. పోషకాహారం తీసుకునేలా పిల్లలకు నచ్చజెప్పాలి. తృణధాన్యాలూ, కాయగూరలూ, పాల వంటి మేలు చేసే ఆహారంతో మీరేం చేసి పెట్టగలరో చూడాలి. చేపలు వారికి పెట్టగలగాలి. పోషకాహారంతో పాటు శరీరానికి వ్యాయామం ఇవ్వగలిగితే.. పిల్లల శరీరం దృఢంగా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments