Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన నెలను బట్టి పిల్లల్లో రోగాలు: జూలై, అక్టోబర్ నెలల్లో పుట్టినవారైతే?

Webdunia
గురువారం, 2 జులై 2015 (17:27 IST)
వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు పుట్టుకతో సంక్రమిస్తాయని అందరికీ తెలిసిందే. అయితే పుట్టిన నెలను బట్టి కూడా వ్యాధులు వస్తాయని కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. కొలంబియా యూనివర్శిటీ విద్యార్థులు 28 ఏళ్ల పాటు, కొన్ని లక్షల మందిపై చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియవచ్చాయి. ఈ క్రమంలో జూలై, అక్టోబర్ నెలల్లో పుట్టిన వారికైతే ఆస్తమా వచ్చే అవకాశం ఉందని, మార్చిలో పుట్టిన వారికి గుండె సంబంధిత రోగాలు ఏర్పడుతాయని పరిశోధకులు తేల్చారు. 
 
పుట్టిన నెల ఆధారంగా సుమారు 1700కు పైగా అనారోగ్య సమస్యలు పసి పిల్లలను చుట్టుముట్టే ప్రమాదం ఉందని, వాటిల్లో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. అయితే పిల్లల ఆరోగ్య సమస్యల నిర్థారణ సమయంలో ఈ పరిశోధనల్లోని విషయాలు వైద్యులకు ఉపయోగపడతాయని భావిస్తున్నామని.. కానీ పుట్టిన నెలను బట్టి ఇవే వ్యాధులు వస్తాయని చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని పరిశోధకులు అంటున్నారు. 
 
ఇంకా న్యూయార్క్ మెడికల్ డేటాబేస్ పరంగా 1.7 మిలియన్ రోగులు పుట్టిన నెల ప్రకారం ఏర్పడిన 55 వ్యాధులతో బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. అలాగే మే నెలలో పుట్టిన పిల్లల్లో రోగాలు చాలా తక్కువని, కానీ అక్టోబర్, నవంబర్‌లో పుట్టిన పిల్లల్లో వ్యాధుల సంఖ్య అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments