Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు హోంవర్క్ చేయడానికి మారాం చేస్తున్నారా..!

Webdunia
మంగళవారం, 12 జనవరి 2016 (10:56 IST)
ప్రతిరోజూ పిల్లలతో హోంవర్క్ చేయించడం తల్లిదండ్రులకు ఓ సవాల్‌గానే ఉంటుంది. కొందరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగు పక్కన పడేసి ఆటలాడటానికి వెళ్తుంటారు. ఉదయం లేవగానే హోంవర్క్ చేయలేదనే విషయం గుర్తొచ్చి, టీచర్ తిడుతుందని స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వారితో హోంవర్క్ సులభంగా పూర్తిచేయించవచ్చు.
 
ప్రతిరోజూ పిల్లలు స్కూల్ నుంచి రాగానే టీచర్లు ఏం చెప్పారు? చేయాల్సిన హోంవర్క్ ఏంటి? అనే విషయాలను అడిగి కనుక్కోవాలి. హోంవర్క్ చేసే సమయంలో పిల్లలకు చాలా సందేహాలు వస్తుంటాయి. అలాంటపుడు దగ్గరుండి వారి సందేహాలను తీర్చాలి. దాంతో వారు మరింత ఉత్సాహంగా హోంవర్క్ పూర్తి చేస్తారు.
 
పిల్లలు నలుగురైదుగురు కలిసి ఒకేచోట కూర్చుని హోంవర్క్ చేసుకొనేలా చేస్తే మరీ మంచిది. ఒకరిని చూసి ఒకరు హోంవర్క్ తొందరగా ఉత్సాహంగా కంప్లీట్ చేస్తారు. సమయంలోగా హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలని షెడ్యూల్ పెట్టాలి. దీనివల్ల పిల్లలకు షెడ్యూల్‌లో పనిపూర్తి చేసుకునే అలవాటు వస్తుంది.
 
పిల్లలు హోంవర్క్ చేసే సమయంలో పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడటం, టీ.వి చూడడం చేయకూడదు. దానివల్ల వారి కాన్‌సన్‌ట్రేషన్ దెబ్బతింటుంది. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments