మ్యాగీ లాంటి ఫుడ్స్ కంటే.. హెల్త్ మిక్స్ పిల్లలకు ఇవ్వొచ్చా?

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2015 (11:32 IST)
మ్యాగీ లాంటి ఫుడ్స్ కంటే హెల్త్ మిక్స్ వంటి ఫుడ్‌ను పిల్లలకు నిశ్చింతగా ఇవ్వొచ్చునని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అయితే షాపుల్లో అమ్మే హెల్త్ మిక్స్ పౌడర్ల కంటే ఇంట్లోనే తయారు చేసే హోమ్‌మేడ్ పౌడర్లతో తయారుచేసే గంజిని ఇవ్వడం ద్వారా పిల్లలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. స్కూల్, స్పోర్ట్స్, ట్యూషన్ అంటూ పరుగుబెడుతున్న పిల్లలకు పూర్తిశక్తినిచ్చేది హెల్త్ మిక్స్ మాత్రమే. 
 
రాగి, మొక్కజొన్న, సజ్జలు, వేరుశెనగలు, పప్పు దినుసులన్నీ సమపాళ్ళలో హెల్త్ మిక్స్‌లో ఉండటం వల్ల పిల్లలకు ఈ గంజి పెట్టడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. పిల్లలు హెల్దీగా ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా హెల్త్ మిక్స్‌ గంజి రోజూ తెల్లారు ఒక రెండు గ్లాసులు ఇవ్వడమే అంటున్నారు న్యూట్రీషన్లు. 
 
పప్పు దినుసు, రాగి, సజ్జలు, మొక్కజొన్నలు నెలకు కావాల్సినంత పౌడర్‌లా చేసుకుని ప్రతిరోజూ గంజిలా తయారు చేసి కొంచెం పాలు కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా శరీరానికి కావాలసిన పోషకాలు లభిస్తాయని వారు అంటున్నారు. 
 
ఇంకా ఈ పిండిలో కాస్త బెల్లం కలిపి స్నాక్స్‌లా కూడా పిల్లలకు పెట్టొచ్చు. మొక్కజొన్నలో విటమిన్లు, రాగిలో ఫాస్పరస్, కాల్షియం, పప్పు దినుసుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో  బ్రేక్ ఫాస్ట్‌కు దీన్ని ఎంచుకోవచ్చు. సగ్గుబియ్యం, వేరుశెనగ, వేయించిన మినపప్పు, ఎర్రని బియ్యం, గోధుమ, రాగి, మొక్కజొన్న, బీన్స్, వరి, ఉద్దిబియ్యం, సజ్జలు, బాదం, జీడిపప్పు, పిస్తా, ఏలకులు వంటివి ఈ హెల్త్ మిక్స్‌లో కలుపుకోవచ్చునని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

యూఎస్-ఇరాన్ యుద్ధం తాత్కాలిక విరమణ ఒప్పందంపై సంతకం పెట్టకుండా లేచెళ్లిపోయిన ట్రంప్, ఏం జరుగుతుంది?

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

Show comments