ఫీడింగ్ బాటిల్స్ ఉపయోగించడం మంచిదా? కాదా?

Webdunia
సోమవారం, 25 మే 2015 (16:48 IST)
పిల్లలకు ఫీడింగ్ బాటిల్స్ ఉపయోగించవద్దని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. రకరకాల ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పెదవులు, దంతాలు, నోటి అమరికలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 
 
రబ్బర్‌లోని కంటికి కనిపించని జెమ్స్ ద్వారా అనారోగ్య సమస్య ఏర్పడుతున్నాయి. మదర్ ఫీడ్ అయితే ఆరోగ్యదాయకమని, అదే ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పాలను ఇచ్చేటప్పుడు నాలుకు మడత పడుతుందని.. తాగిన తర్వాత శ్వాస తీసుకోవడం పిల్లలకు కష్టమవుతుంది. మదర్ ఫీడ్, కప్పుల్లో పాలు తాగే పిల్లల కంటే ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పాలు తాగే పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిసింది. 
 
ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పిల్లలు పాలు తాగితే పాలతో పాటు గాలికూడా కడుపులోకి చేరుకుంటుంది. తద్వారా గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడుతాయి. బాటిల్స్ పాలు తాగే పిల్లలు మదర్ ఫీడ్‌కు దూరమవుతారు. పాల బుడ్డీల కంటే గ్లాసుల ద్వారా పిల్లలకు పాలు పట్టించడం మంచిది. ఫీడింగ్ బాటిల్ ద్వారా పిల్లలు పాలు తాగితే.. దవడ, దంత సమస్యలు ఏర్పడతాయి. 
 
మాటలు సకాలంలో రావు. ఉచ్ఛారణ సరిగ్గా ఉండదు. దంత వరుసలో మార్పులుంటాయి. ఫీడింగ్ బాటిల్స్ అధికంగా ఉపయోగిస్తే.. డయేరియా వంటి సమస్యలు పిల్లల్లో ఏర్పడుతాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మదనపల్లి బాలిక హత్య కేసు: వాడిని మాకు అప్పగించండి, నడిరోడ్డుపై చంపేస్తాం, ఎవరు?

బోరున విలపించిన ఎర్రబెల్లి - రాజకీయాల్లో ఉండాలా వద్దా అంటూ కంటకన్నీరు...

ప్రతిరోజూ బిస్కెత్తులు వేస్తున్న మహిళనే కరిచిన వీధికుక్కలు, వీడియో చూడండి

వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా అమర్చి రికార్డు చేశారు.. కన్నడ నటి ఫిర్యాదు

చంద్రబాబు విజన్‌ను బిల్‌గేట్స్ ప్రశంసించడాన్ని జగన్ జీర్ణించుకోలేకున్నారు : మంత్రి పార్థసారథి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

నన్ను పెళ్లి చేసుకునే మగాడు ఒక్కడు కూడా లేరా? 'ఆనందం' ఫేం రేఖ

Show comments